దీపావళి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పండుగ వేళ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లగా, తిరిగా వచ్చే సమయంలో క్రౌడ్ కంట్రోల్ మీద రైల్వే అధికారులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా దీపావళి రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు నుంచి వైజాగ్‌కు ప్రత్యేక రైలును ప్రకటించారు.
దీపావళి పండుగ సందర్భంగా చాలా మంది వైజాగ్ నుంచి బెంగళూరుకు వెళ్తుంటారు. వారు తిరిగి వచ్చేందుకు అనుగుణంగా ఈ రైలును నడుపుతున్నట్లు నైరుతి రైల్వే (SWR) ప్రకటించింది. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు బుధవారం (అక్టోబర్ 22న) నాడు ప్రత్యేక రైలును నడుపుతోంది.ఈ వన్ వే రైలు (నంబర్ 08544) బుధవారం మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగుళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. గురువారం నాడు మధ్యాహ్నం 1 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
Read Also: మెట్రో రైల్లో చిన్నారుల డ్యాన్స్, చూస్తే ఫిదా కావాల్సిందే!
బెంగళూరు- విశాఖపట్నం ప్రత్యేక రైలు మార్గం మధ్యలో పలు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. బుధవారం SMVT నుంచి బయల్దేరే ఈ రైలు కృష్ణరాజపురం, బంగారుపేట, కుప్పం, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట్, ఎలమంచిలి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. గురువారం నాడు మధ్యాహ్నం 1 గంటలకు గంటలకు విశాఖపట్నం రీచ్ అవుతుంది. ఇక దీపావళి రద్దీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ రైలు సేవలను వినియోగించుకోవాలని ప్రయాణీకులకు రైల్వే అధికారులు సూచించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరంగా ప్రయాణించాలని సూచించారు.
Read Also: విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు, పండుగ రద్దీ నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం!