BigTV English

Monsoon Diseases Tips: వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Monsoon Diseases Tips: వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Monsoon Diseases in Rainy Season and Prevention: వాతావరణం చల్లబడింది.. వర్షాకాలం మొదలైంది. అయితే ఆ సీజనల్ లో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో వైరస్‌ల వ్యాప్తి అధికంగా ఉంటుంది. వీటి వల్ల అనేక వైరల్ ఇన్ ఫెక్షన్ లు, జలుబు, జ్వరం వంటి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


వైరల్ ఫీవర్లు ఎందుకు వస్తాయంటే..

వైరల్ ఇన్ ఫెక్షన్‌లు, వైరల్ ఫీవర్లు, సాధారణంగా గాలి ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తిచెందుతాయి. ఒక్కొక్కసారి శ్వాసకోసం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఈ రోజుల్లో వ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. దీనికి కారణం ఆహారపు అలవాట్లలో మార్పులు.. జీవన శైలిలో మార్పులు.. కలుషిత నీరు.. ఆరోగ్యం పై అజాగ్రత్త వల్ల ఇలాంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ వైరల్ ఇన్ ఫెక్షన్స్ వల్ల మన శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. తద్వార రక్త సరఫరా నెమ్మదిగా ఉంటుంది. రక్తంలో ఉండే తెల్ల రక్తకణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. రోగనిరకోధక శక్తి తగ్గిపోతుంది. ఈ వైరల్ ఫీవర్లు, వైరల్ ఇన్ ఫెక్షన్‌లు, పిల్లల్లో త్వరగా వ్యాప్తి చెందుతాయి. అందువల్ల ఈ సీజన్ లో ఆరోగ్యంపై మరింత శ్రద్ద పెట్టాలి.


ఈ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

వర్షాకాలంలో దోమల వ్యాప్తి అధికంగా ఉంటాయి. వీటి ద్వారా డెంగ్యూ జ్వరం, చికున్‌గున్యా, వైరల్‌ ఫ్లూ, ఇన్‌ఫెక్షన్‌, అలర్జీ, గ్యాస్ట్రోఎంటెరిటిస్‌, టైఫాయిడ్‌ ఫీవర్, హెపటైటిస్‌ ఎ, ఇ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

వైరల్ ఫీవర్ లక్షణాలు

వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు వ్యాప్తి చెందినప్పుడు ఒళ్లు నొప్పులు, జ్వరం, వాంతులు, స్కిన్ అలర్జీ, నీరసం, ఆకలి లేకపోవడం, గొంతునొప్పి, తీవ్రంగా జలుబు చేయడం. కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వర్షాకాలంలో వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలో చల్లదనానికి సూక్ష్మజీవులు సులువుగా మన శరీరంలోకి వ్యాపిస్తాయి.. దోమలు వ్యాప్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఫుల్ స్లీవ్ దుస్తులను ధరిస్తే బెటర్.. ఎందుకంటే దోమల నుండి కపాడుకోవచ్చు. వర్షంలో వెళ్లేటప్పుడు గొడుగు, రెయిన్ కోట్ తప్పనిసరిగా ధరించాలి. కాచి చల్లార్చిన నీటిని తాగితే మంచిది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తినాలి. బయట ఫుడ్‌కి దూరంగా ఉండండి. పిల్లల లంచ్ బాక్స్ లో ఫ్రూట్స్ ని పెట్టండి. గొంతు నొప్పి కనుక వస్తే ఖచ్చితంగా వైరస్‌లే కారణం, గోరువెచ్చటి నీటిలో చిటెకెడు ఉప్పు వేసుకొని తరుచుగా పుక్కిలించండి. ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోండి. ఆహారం వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా మంచిది. మరీ ముఖ్యంగా తరచుగా చేతులు కడుక్కోవాలి. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

 

Tags

Related News

Home remedies: రాత్రి దిండు కింద పెట్టే సింపుల్ హోమ్ రెమిడీ.. ఇలా చేస్తే..

Onion juice: జుట్టుకు ఉల్లిపాయ రసం రాస్తున్నారా? వీటిని కలిపితే..

Home remedies: కఫం, జలుబు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ హోమ్ రెమిడీతో ఇట్టే మాయమైపోతాయి

Independence day Recipes: ఇండిపెండెన్స్ డేకు మూడు రంగుల్లో పులావ్, దోశ చేసి దేశభక్తిని చాటుకోండి

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్పెషల్ కోట్స్, విషెస్ చెప్పండిలా..

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్ట్ 15న జరుపుకోవడానికి వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×