Mars Transit 2024 : భూమికి విష్ణుమూర్తికి పుట్టిన కొడుకు అంగారకుడిగా చెబుతాయి. ఇది నవగ్రహాలలో నాల్గవ గ్రహం. దీనినే కుజగ్రహం అని కూడా పిలుస్తాం. విష్ణుమూర్తి చెమట చుక్క నుంచి ఉద్భవించిన అంగారకుడు.. తన తపస్సుతో బ్రహ్మను మెప్పించి గ్రహంగా మారినట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది.
గ్రహాలకు అధిపతి అయిన కుజుడు 45 రోజులపాటు వృషభరాశిలో సంచరించనున్నాడు. ఈ కారణంగా మేషం నుంచి మీన రాశివరకూ దీని ప్రభావం ఉంటుంది. భూమి పుత్రుడైన అంగారకుడి రాశిమార్పు.. 2024లో ద్వాదశ రాశుల వారికి స్నేహ భావాన్ని కలిగిస్తుంది. అయితే కొన్ని రాశుల వారి జీవితంలో కొన్ని మార్పులు జరగవచ్చు. ఆ రాశులేంటో.. ఏవేం మార్పులుంటాయో చూద్దాం.
మేషరాశి
మేషరాశివారికి అంగారక సంచారం ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఊహించని శుభవార్తలు వింటారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ప్రతిపనిలోనూ విజయాన్ని అందుకుంటారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. మీ వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. వ్యాపారులకు వ్యాపార విస్తరణ ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
వృషభరాశి
కుజుడి సంచారం.. ఈ రాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కష్టంతో విజయాన్ని సాధిస్తారు. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు లాభపడుతారు. ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం, సంతోషం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కుంభరాశి
ఈ రాశిలో పుట్టినవారికి అంగారక సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. భూమి కొనుగోళ్లు లేదా ఇంటి కొనుగోళ్లు చేస్తారు. కెరీర్ లో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణించేవారికి సానుకూలంగా ఉండనుంది. ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థిక లాభం వచ్చే అవకాశాలున్నాయి.