E-Paper
Advertisement

Cyber Bribery: ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ స్టేషన్‌పై ఏసీబీ పంజా.. ఇద్దరు ఎస్సైలు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్!

Cyber Bribery: ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ స్టేషన్‌పై ఏసీబీ పంజా.. ఇద్దరు ఎస్సైలు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్!
Advertisement

Cyber Bribery: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దాడులు నగరంలో సంచలనం సృష్టించాయి. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు, ఇద్దరు ఎస్సైలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఆర్‌ఎస్సైలు (RSI) ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ ఒక సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించి నిందితుడికి లేదా బాధితుడికి సహాయం చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. ప్రధానంగా, సదరు వ్యక్తికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయకుండా ఉండటానికి, సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు వారు రూ. ఒక లక్ష నగదు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. పోలీసుల వేధింపులను తట్టుకోలేక బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

Advertisement

బాధితుల ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ హైదరాబాద్ రేంజ్-2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలోని బృందం పక్కా ప్రణాళికతో సైబర్ క్రైమ్ స్టేషన్‌పై దాడి చేసింది. బాధితుడి నుండి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ ఇద్దరినీ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, స్టేషన్‌లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.

పోలీసు వ్యవస్థలో ఉంటూ చట్టాన్ని కాపాడాల్సిన వారే ఇలా అవినీతికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశమైంది. పట్టుబడ్డ ఇద్దరు ఎస్సైలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించే ప్రక్రియను చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా ఏసీబీని సంప్రదించాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు సూచించారు.

Advertisement

Also Read: నాగర్‌కర్నూల్ స్కూల్‌లో కలెక్టర్ మార్క్ తనిఖీ.. ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×