హస్త ప్రయోగం గురించి చాలా రకాల వాదనలు ఉన్నాయి. కొంత మంది హస్త ప్రయోగం ఆరోగ్యానికి మంచిదని చెప్తుండగా, మరికొంత మంది అతిగా హస్త ప్రయోగం చేయడం మంచిది కాదని చెప్తుంటారు. హస్త ప్రయోగం చేయడం వల్ల అంగం బలంగా మారుతుందని కొంత మంది అంటుంటే.. ఎక్కువగా ఆ పని చేయడం వల్ల వీక్ అయ్యే అవకాశం ఉందని మరికొంత మంది అంటున్నారు. డా. సమరం లాంటి లైంగిక ఆరోగ్య నిపుణులు హస్త ప్రయోగం మంచిదని తరచుగా చెప్తుంటారు. అదే సమయంలో అతి పనికిరాదనే విషయాన్ని నొక్కి వక్కిణిస్తుంటారు. ఇక తాజాగా హార్వర్డ్ పరిశోధకులు హస్త ప్రయోగం, స్కలనం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంతకీ వాళ్లు ఏం చెప్పారు? హస్త ప్రయోగం మంచిదా? కాదా? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వయసులో ఉన్న యువకులు శృంగార కోరికలు కలిగిన వేళ హస్త ప్రయోగం చేసుకుంటారు. నూటికి 90 శాతం మంది యువకులు హస్త ప్రయోగం అనుభవమేనని శృంగార నిపుణులు చెప్తుంటారు. ఇంత కాలం ఈ విషయంలో రకరకాల వాదనలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ అంశానికి సంబంధించి హార్వర్డ్ పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. హస్త ప్రయోగం ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని ధృవీకరించారు. అదే సమయంలో తరచుగా స్కలనం చేయడం వల్ల అత్యంత ప్రమాదకరమైన ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుకునే అవకాశం ఉందన్నారు.
హార్వర్డ్ పరిశోధకుల స్ఖలనం, ప్రోస్టేట్ ఆరోగ్యం మధ్య కీలక సంబంధం ఉందని కనుగొన్నారు. అంతేకాదు, నెలకు 21 సార్లు స్కలనం చేసే పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని వెల్లడించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా 30,000 మందికి పైగా పురుషులపై అధ్యయనం చేసిన తర్వాత హార్వర్డ్ పరిశోధకుల బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. తరచుగా స్కలనం చేయడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి కేసులు తగ్గాయన్నారు. క్రమం తప్పకుండా స్కలనం చేయడం కారణంగా కాలక్రమేణా పేరుకుపోయే క్యాన్సర్ కారకాలు బయటకు వెళ్లే అవకాశం ఉందన్నారు.
Read Also: జుట్టుకు రంగు వేసుకుంటున్నారా? చావు ఖాయం, ఆ అమ్మాయికి ఏమైందంటే?
హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనం ప్రోస్టేట్ ఆరోగ్యం అనేది చేసే లైఫ్ స్టైల్ కారణం అవుతుందని లేల్చింది. అయితే, హస్త ప్రయోగం అనేది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు ప్రొస్టేట్ క్యాన్సర్ ను మాత్రం దూరం చేస్తుందన్నారు. సమరం లాంటి వాళ్లు చెప్పే మాటలను బేస్ చేసుకుంటే, హస్త ప్రయోగంతో అంగం బలంగా మారడంతో పాటు మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో, ఇకెందుకు అబ్బాయిలూ.. వెంటనే వాష్ రూమ్ బాట పట్టండి.. ఆ క్యాన్సర్ నుంచి బయటపండి! లైంగిక ఆనందాన్ని అనుభవించండి!
Read Also: అరబ్ దేశీయులు ముక్కుతో ముద్దులు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?