Group-2 Offer Letters: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇది భారీ శుభవార్త. ఈనెల 18న వారికి నియామక పత్రాలు అందించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. టీజీపీఎస్సీ నిర్వహించిన ఈ నియామక ప్రక్రియలో మొత్తం 783 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సాధారణ పరిపాలన, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పంచాయతీరాజ్ సహా మొత్తం 16 శాఖల్లోని వివిధ ఉద్యోగాలకు వీరిని ఎంపిక చేశారు.
ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణరావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు, ఎంపికైన అభ్యర్థులు సుమారు 30 ఏళ్ల పాటు ప్రభుత్వ సర్వీసులో ఉండనున్నందున, వారిలో ప్రభుత్వ ఉద్యోగం పట్ల ఉన్నత భావన, ఆత్మవిశ్వాసం కలిగేలా ఈ నియామక పత్రాల ప్రదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎస్ పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, అలాగే వికాస్ రాజ్, బీఎండీ ఎక్కా, రిజ్వి, సందీప్ కుమార్ సుల్తానియా, లోకేష్ కుమార్, టీకే శ్రీదేవి, ఆర్.వి.కర్ణన్, ప్రియాంక, నాగిరెడ్డి వంటి వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏర్పాట్లు గ్రూప్-2 అభ్యర్థుల భవిష్యత్తుకు శుభసూచకంగా నిలుస్తున్నాయి.
ALSO READ: Apple Bug Bounty: రూ.17 కోట్ల బహుమతి ప్రకటించిన ఆపిల్ కంపెనీ.. మీరూ గెలుచుకోవచ్చు, ఎలాగంటే?