OTT Movie : థ్రిల్లర్ జానర్ లో ఓటీటీలోకి ఎక్కువగా సినిమాలు ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ సినిమాలను డిఫరెంట్ స్టైల్ లో ప్రజెంట్ చేయడానికి దర్శకులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నంలో భాగంగా, కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. థియేటర్లలో కూడా దీనికి పాజిటివ్ టాక్ రావడంతో, ఓటీటీలో అంచనాలు పెరిగాయి. ఈ కథ కర్ణాటకలో ఉండే ఒక గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. ఆ ఊరిలో మాంసం కొట్టును నడిపే, ఒక పెద్ద మనిషి చనిపోవడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. ట్విస్ట్లు, సస్పెన్స్ తో ఈ సినిమా, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
‘రిప్పన్ స్వామి’ (Rippan Swamy) ఒక కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. కిషోర్ మూడ బిడ్రే దర్శకత్వంలో విజయ్ రాఘవేంద్ర, అశ్విని చంద్రశేఖర్, యమునా శ్రీనిధి, ప్రకాశ్ తుమినాడ్, అనుష్క అది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 29, థియేటర్లలో రిలీజ్ అయింది. అక్టోబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. IMDbలో 8.4/10 రేటింగ్ తో, కన్నడ, తెలుగు, తమిళ వెర్షన్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఒక చిన్న గ్రామంలో రిప్పన్ స్వామిని అందరూ గౌరవిస్తుంటారు. అయితే ఒక రోజు అతను హఠాత్తుగా చనిపోతాడు. అది చూడటానికి ఆత్మహత్య లాగా కనిపిస్తుంది. దీంతో అతని భార్య అశ్వినితో సహా అక్కడి వాళ్ళంతా షాక్ అవుతారు. రిప్పన్ స్వామి మరణం వెనుక ఏదో రహస్యం ఉందని అందరూ అనుమానిస్తారు. ఇక ఆ గ్రామంలో టెన్షన్ మొదలవుతుంది. అందరూ ఒకరినొకరు అనుమానిస్తూ ఉంటారు. చేస్తారు. రిప్పన్ స్వామికి శత్రువులు ఎవరున్నారనే ప్రశ్నలు వస్తాయి. అశ్విని తన భర్త మరణం గురించి నిజం తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది.
Read Also : నిద్రపోతే చస్తారు… ఇదెక్కడి దిక్కుమాలిన ప్రయోగం మావా ? బుర్రపాడు ట్విస్టులు
రిప్పన్ స్వామి మరణం ఆ గ్రామంలో సంచలనంగా మారుతుంది. రిప్పన్ స్వామికి గ్రామంలో కొందరితో గొడవలు ఉన్నట్లు తెలుస్తుంది. అశ్విని దీని వెనుక నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతనికి ఉన్న శత్రువులు ఒక్కొక్కరు బయటకి వస్తారు. రిప్పన్ స్వామి మరణం వెనుక అసలు రహస్యం తెలిసి అందరూ షాక్ అవుతారు. రిప్పన్ స్వామి మరణం ఆత్మహత్య కాదని, అది మర్డర్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా, ఎమోషనల్ ఎండింగ్‌తో ముగుస్తుంది. కిల్లర్ ఎవరు ? ఎందుకు చంపారు ? అనే విషయాలను, ఈ మలయాళం థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.