జుట్టు నెరిసిపోతున్నా, అనారోగ్యంగా మారినా కాపర్ కలర్ లోకి మారుతున్నా.. దాని నుంచి కవర్ చేసుకునేందుకు చాలా మంది హెయిర్ డై వేసుకుంటారు. అలాగే, చైనాలోని హెనాన్ ప్రావిన్స్ కు చెందిన 20 ఏళ్ల యువతి హువా.. తన ఫేవరెట్ స్టార్ లా జుట్టుకు కలర్ వేయించుకుంది. ఆమె మాదిరిగానే తరచుగా జుట్టుకు రంగు మార్చుకునేది. కొద్ది రోజుల తర్వాత ఆమె తీవ్రమైన మూత్రపిండాల వాపు (నెఫ్రైటిస్) ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ఆమె జుట్టు రంగును తరచుగా మార్చుకోవడం ఈ సమస్య తలెత్తినట్లు వెల్లడించారు. ఆమె కాళ్లపై ఎర్రటి మచ్చలు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి కూడా ఏర్పడింది. హాస్పిటల్లో చేరిన ఆమెకు టెస్టులు చేసిన డాక్టర్ టావో చెన్యాంగ్.. కీలక విషయాలు వెల్లడించారు. హెయిర్ డైలోని విషపూరిత రసాయనాల కారణంగానే ఆమెకు ఈ సమస్య ఏర్పడినట్లు తెలిపారు. ఇదో అత్యంత అరుదైన, అనారోగ్య కరమైన సమస్యగా ఆయన వెల్లడించారు.
హెయిర్ డైలలో విషపూరిత రసాయనాలు ఉంటాయి. పారాఫెనిలెన్డియమైన్ (PPD), సీసం, పాదరసం లాంటి అనారోగ్యకర లోహాలు ఉంటాయి. ఈ టాక్సిన్లు చర్మం ద్వారా రక్త ప్రవాహంలోకి ప్రవేశించి, నెమ్మదిగా శరీరంలో పేరుకుపోతాయి. ఇలాంటి రసాయనాలు దీర్ఘకాలికంగా శరీరంలోకి చేరడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినడం, శ్వాసకోశ సమస్యలు, అలెర్జీ, మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. హువా తరచుగా రంగులు వేయడం వల్ల ఆమె శరీరం ఈ విషపదార్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం పరిమితికి మించిపోయిందన్నారు డాక్టర్ చెన్యాంగ్. దీనివల్ల మూత్రపిండాల వాపుతో పాటు మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
ఈ ఘటనపై సోషల్ తీవ్ర చర్చ జరిగింది. ఎవరినీ గుడ్డిగా ఆరాధించకూడదన్నారు. సెలబ్రిటీలు అత్యంత సురక్షితమైన రంగులు వేసుకుంటారు. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. వారిని అనుసరించి సామాన్యులు జుట్టుకు రంగులు వేసుకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. యువత తాత్కాలిక అందం కోసం చేసే పనులు ప్రాణాల మీదికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నారు డాక్టర్ చెన్యాంగ్.
ప్రపంచ వ్యాప్తంగా హెయిర్ డై సమస్యల కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ రసాయనాల కారణంగా మూత్రాశయ క్యాన్సర్ వస్తోందని ఆరోపిస్తూ L’Oréal లాంటి బ్రాండ్లపై మాజీ హెయిర్ స్టైలిస్ట్ ఇటీవల USలో దావా వేశారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ తో సహా పలు అధ్యయనాలు, హెయిర్ డై కెమికల్స్ కు ఎక్కువ కాలం గురికావడం వల్ల గణనీయమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేల్చాయి. హెయిర్ డై వేసుకోవడంతో పాటు హెయిర్ డై వేసే వారికి కూడా ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.
జుట్టుకు రంగు వేసుకోవాలనుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 6 నుంచి 8 వారాలకు ఒకసారి హెయిర్ డై వేసుకోవాలనుకుంటున్నారు. PPD, అమ్మోనియా లాంటి భారీ లోహాలు లేని రంగులను ఎంచుకోవాలంటున్నారు. జుట్టుకు రంగు వేసుకోవడానికి ముందు టెస్ట్ చేయాలంటున్నారు. జుట్టుకు రంగు వేసుకునే సమయంలో స్కిన్ స్పెషలిస్టును సంప్రదించాలంటున్నారు. జుట్టుకు కలర్ అప్లై చేసేటప్పుడు గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలంటున్నారు. హెయిర్ డై వేసుకునే సమయంలో జుట్టుకు గ్లౌజులు వాడాలంటున్నారు.
Read Also: కొలెస్ట్రాల్ వేగంగా పెంచే ఆహారాలివే.. దూరంగా ఉండకపోతే కష్టమే !