E-Paper
Advertisement

Guntur Crime: బిర్యానీ పెట్టి, అప్పడాల కర్రతో కొట్టి.. భర్త హత్యకు భార్య మాస్టర్ ప్లాన్

Guntur Crime: బిర్యానీ పెట్టి, అప్పడాల కర్రతో కొట్టి.. భర్త హత్యకు భార్య మాస్టర్ ప్లాన్
Advertisement

Guntur Crime: బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తను హత్య చేసింది భార్య. ఈ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో కలకలం రేపుతోంది. ఈ కేసులో నిందితులు గోపీ, లక్ష్మీ మాధురి, సురేశ్‌లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

పోలీసుల ప్రకారం..

చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతడికి లక్ష్మీమాధురి అనే మహిళతో 2007లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. భార్య లక్ష్మీ మాధురి విజయవాడలోని సినిమా హాల్లో టికెట్‌ కౌంటర్‌లో పనిచేస్తుంది. ఆ సమయంలో ఆమెకు సత్తెనపల్లికి చెందిన గోపితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. గోపి హైదరాబాద్ లో ట్రావెన్స్ నిర్వహిస్తుండడంతో.. అతడి వద్దకు భర్తను ఉద్యోగానికి పంపింది. కొంతకాలం తర్వాత నాగరాజు హైదరాబాద్‌ నుంచి చిలువూరుకు తిరిగి వచ్చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. నాగరాజు ఇంటి వద్ద నుంచే వ్యాపారం చేస్తుండడంతో..గోపిని కలవడానికి అడ్డుగా మారాడు. దీంతో అతడిని అడ్డు తప్పించుకోవాలని లక్ష్మీమాధురి ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.

బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి

Advertisement

ఆర్‌ఎంపీ సురేశ్‌ వద్ద గోపి నిద్రమాత్రలు తీసుకుని లక్ష్మీమాధురికి ఇచ్చాడు. ఈ నిద్ర మాత్రలను లక్ష్మీ బిర్యానీలో కలిపి భర్తకు పెట్టింది. ఆ బిర్యానీ తిన్న తర్వాత నిద్రమత్తులో ఉన్న భర్త గుండెపై అప్పడాల కర్రతో బలంగా కొట్టి చంపారు. ఈ నెల 18న శివనాగరాజు మృతి చెందాడు. అయితే అతడి మృతి అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టులో ఛాతీపై ఎముకలు విరిగినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోలీసులు తమ స్టైల్ విచారణ చేయగా.. లక్ష్మీ మాధురి అసలు విషయం బయటపెట్టింది. దీంతో నిందితులు లక్ష్మీ మాధురి, గోపి, నిద్ర మాత్రలు ఇచ్చిన ఆర్ఎంపీ సురేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: పండుగ పూట తీరని లోటు.. బాన్సువాడ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×