E-Paper
Advertisement

Healthy Meals: సౌత్ ఇండియన్ రుచులు.. తింటూనే బరువు తగ్గి, మంచి శరీరాకృతిని పొందొచ్చు!

Healthy Meals: సౌత్ ఇండియన్ రుచులు.. తింటూనే బరువు తగ్గి, మంచి శరీరాకృతిని పొందొచ్చు!
Advertisement

Healthy Meals: ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. ఈ క్రమంలో బరువు తగ్గడానికి కఠినమైన వ్యాయామాలు, డైట్‌ప్లాన్ వంటివి పాటిస్తున్నా కొంతమందికి ఎలాంటి ఫలితం ఉండదు. అలాంటి వాళ్లు సౌత్ ఇండియన్ ఫుడ్స్ ట్రై చేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. కొన్నిరకాల సౌత్ ఇండియన్ ఫుడ్స్ తినడం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. మన వంటింట్లో లభించే పదార్థాలతో 200 కేలరీల కంటే తక్కువగా ఉండే అనేక రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ తయారు చేసుకోచ్చని సూచిస్తున్నారు. ఈ రెసిపీస్ చాలా టేస్టీగా ఉండటంతో పాటు సులభంగా డైజెస్ట్ అవుతాయట. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

పెసరట్టు:

పెసరట్టు అనేది.. న్యూట్రియస్ ఫుడ్. దీనిని ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా స్నాక్స్‌గా తీసుకుంటే.. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది తక్కువ క్యాలరీస్, ఎక్కువ పోషకాలతో ఉండే ఆహారం. కాబట్టి.. ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. అటు బరువును కూడా నియంత్రణలో పెట్టుకోవచ్చు. ఖరీదైన డైట్స్ లేదా ఔషధాలపై డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈ రెసిపీస్‌తో వెయిట్ లాస్ అవ్వొచ్చు.

రసం/చారు:

Advertisement

సౌత్ ఇండియన్స్ భోజనంలో రసం కచ్చితంతా ఉండాల్సిందే. దీనిని చారు అని కూడా పిలుస్తుంటారు. చింతపండు గుజ్జుతో తయారు చేసే ఈ రసం రుచిగా ఉండటమే కాకుండా బరువు తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అధిక బరువు ఉన్నవాళ్లు రోజూ వ్యాయామాలు చేస్తూనే.. క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ రసాన్ని తీసుకోవాలని అంటున్నారు.

వెజిటేబుల్స్‌ సాంబార్:

ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, మంచి పోషకాహారంగానూ వెయిట్ లాస్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. బరువు తగ్గానులకునే వారికి సాంబార్ బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ అవుతుంది. చాలా టేస్టీగా ఉండే సాంబార్‌లో వడ, దోసె, ఇడ్లీ ముంచుకుని తినొచ్చు. సాంబార్‌‌ను క్యారెట్లు, బీన్స్, టమోటాలు వంటి కూరగాయలతో తయారు చేస్తారు కాబట్టి.. దీని ద్వారా మంచి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.

Advertisement

Also read: ఉదయాన్నే పొట్టలో ఏదోఒకటని తోసేస్తున్నారా?.. బ్రేక్‌ఫాస్ట్‌పై హార్వర్డ్ నిపుణుల సలహా ఇదే!

రవ్వ ఉప్మా:

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా రవ్వతో చేసిన ఉప్మాను తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఈ రవ్వ ఉప్మా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. పలు రకాల కూరగాయలను జోడించి తయారు చేసినందున, ఇది తినడం వల్ల ఆరోగ్యానికి తగినంత ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి.. సులభంగా బరువును నియంత్రించవచ్చు.

ఓట్స్ ఇడ్లీ:

ఓట్స్‌తో తయారు చేసిన ఇడ్లీ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. మరింత రుచి కోసం దీనిని సాంబార్‌తో కలిపి తీసుకోవచ్చు. ఓట్స్ ఇడ్లీ తింటే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఉండవు. దీనిలో సులభంగా జీర్ణం చేసుకునేలా ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ఓట్స్ ఇడ్లీని సాంబార్ లేదా చట్నీలతో కలిపి తీసుకుంటే.. బరువు తగ్గడానికి ఇడ్లీలు గొప్ప అల్పాహారం ఎంపిక .

పెరుగు అన్నం:

సౌత్‌ ఇండియన్స్ పెరుగు అన్నం టేస్టీగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి, డైజెషన్‌కు కూడా మేలు చేస్తుంది. దీన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో కలిపి తినొచ్చు. బ్రౌన్ రైస్‌తో పెరుగన్నం చేసుకుంటే ఇంకా మంచిది. ఇందులో బాదం, గుమ్మడి, పొద్దు తిరుగుడు వంటి గింజలు కూడా కలుపుకోవచ్చు. ఈ కాంబినేషన్ బరువు తగ్గడానికి తోడ్పడతాయి.

మొలకెత్తిన గింజల సలాడ్:

ఉదయం అల్పాహారంలో మొలకెత్తిన బఠానీ సలాడ్ తీసుకుంటే.. ఆరోగ్యానికి మంచిది. ఈ సలాడ్ ద్వారా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. మొలకెత్తిన గింజల సలాడ్ జీర్ణ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది.

Also Read: స్కిన్నీ జీన్స్ సిండ్రోమ్.. ఆరోగ్యానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్న ఫ్యాషన్ ట్రెండ్!

Related News

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

Big Stories

Advertisement
×