E-Paper
Advertisement

Curry Leaves Benefits: ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు

Curry Leaves Benefits: ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు
Advertisement

Curry Leaves Benefits: కరివేపాకు ప్రతి రోజు వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటారు. చాలా మంది ఇళ్లలో కూడా కరివేపాకు చెట్లను పెంచుకుంటారు. ఇదిలా ఉంటే కరివేపాకులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. కరివేపాకులో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫైబర్, ఐరన్ వంటివి కూడా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియకు, రోగ నిరోధక శక్తికి, కంటి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. దీర్ఘకాలిక శక్తిని, చర్మ ఆరోగ్యాన్ని, మొత్తం రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది. కరివేపాకులోని ఫైబర్, విటమిన్లు ,యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అవసరం అయిన శక్తిని అందిస్తాయి.

Advertisement

కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణ, బరువు తగ్గడం, గుండె సంబంధిత సమస్యలపై సానుకూల ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా.. ఇది జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు:

Advertisement

మెరుగైన జీర్ణక్రియ:
కరివేపాకులో ఉండే ఫైబర్, ఆల్కలాయిడ్లు కడుపులోని ఎంజైమ్‌లను సక్రియం చేస్తాయి. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా గ్యాస్,మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకును నమలడం వల్ల రోజంతా మీ జీర్ణవ్యవస్థ సజావుగా ఉంటుంది. అంతే కాకుండా మీ జీవక్రియను కూడా వేగవంతం అవుతుంది.

బరువు తగ్గడంలో సహాయం:
కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి సహాయపడతాయి. వీటిని తినడం వల్ల ఆకలిని నియంత్రణలో ఉంటుంది. శరీరం శుభ్రపడుతుంది. అంతే కాకుండా దీర్ఘకాలికంగా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

రక్తంలో చక్కెర నియంత్రణ:
కరివేపాకులో గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేసే, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే సమ్మేళనాలు ఉంటాయి. ఇది మధుమేహం లేదా ప్రీ-డయాబెటిక్స్ ఉన్నవారిలో.. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

చర్మం, జుట్టు ఆరోగ్యం:
కరివేపాకులో విటమిన్ సి, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా మొటిమల నుండి ఉపశమనం కలిగిస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. తద్వారా జుట్టు రాలడం, తెల్ల జుట్టు వంటి సమస్యలను నివారిస్తాయి.

Also Read: పసుపులో ఈ ఒక్కటి కలిపి వాడితే.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది

రోగ నిరోధక శక్తి పెరుగుదల:
కరివేపాకులో కాలేయ పనితీరును మెరుగు పరచి రక్తంలోని మలినాలను తొలగించే ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలోని విటమిన్లు ఎ, బి, సి, ఇ ,యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు తరచుగా వీటిని తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

Related News

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

Big Stories

Advertisement
×