Turmeric For Grey Hair: ఈ రోజుల్లో చిన్న వయస్సు వారికి కూడా తెల్ల జుట్టు సమస్య సర్వసాధారణంగా మారింది. తెల్ల జుట్టు మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే చాలా మంది జుట్టుకు రంగు వేయక తప్పడం లేదు. ఎక్కువ కాలం రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కలర్స్ వాడటం వల్ల జుట్టును పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టును నల్లగా, బలంగా చేసేందుకు పసుపు ఉపయోగపడుతుంది. ఇది తెల్ల జుట్టును పూర్తిగా నల్లగా మారుస్తుంది.
పసుపు :
ఆయుర్వేదంలో పసుపును శక్తివంతమైన ఔషధంగా పరిగణిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మం , జుట్టు రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటాయి. తెల్ల జుట్టు, చుండ్రు, జుట్టు రాలడం, తలపై ఇన్ఫెక్షన్లు వంటి జుట్టు సమస్యలకు పసుపు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
హెయిర్ కలర్ తయారీ:
కావలసినవి:-
పసుపు పొడి – 2 టీస్పూన్లు
ఉసిరి పొడి – 2 టీస్పూన్లు
కొబ్బరి నూనె లేదా ఆవాల నూనె -3-4 టీస్పూన్లు
మెంతులు – 1 టీస్పూన్ (పేస్ట్)
కరివేపాకు – కొన్ని ఆకులు
నీరు (అవసరానికి తగ్గట్టుగా)
తయారీ విధానం:-
1. ఇనుప పాన్‌లో నూనె వేడి చేయండి.
2. కరివేపాకు, మెంతుల పేస్ట్ వేసి వేయించండి.
3. ఇప్పుడు ఉసిరి పొడి, పసుపు పొడి వేసి బాగా కలపండి.
4. మిశ్రమం కొద్దిగా చల్లబడిన తర్వాత.. జుట్టు మూలాలపై అప్లై చేయండి.
5. సుమారు 1 గంట పాటు అలాగే ఉంచండి.
6. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.
పసుపుతో తయారు చేసిన హెయిర్ కలర్ ప్రయోజనాలు:
1. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: పసుపు తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు మూలాలకు పోషణను అందిస్తుంది.
2. ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది: తలలో ఫంగల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు జుట్టు రాలడానికి కారణమవుతాయి. పసుపు ఈ ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది.
3. మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది: జుట్టు యొక్క సహజ రంగు మెలనిన్ అనే వర్ణద్రవ్యం నుండి తయారవుతుంది. పసుపు ఈ వర్ణద్రవ్యం ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టును నల్లగా చేస్తుంది.
4. చుండ్రు , దురద నుండి ఉపశమనం: పసుపు తలపై చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అంతే కాకుండా కుదుళ్ల నుండి చుండ్రును తొలగించడానికి సహాయపడుతుంది.
1. ఉసిరి: ఉసిరి జుట్టుకు బాగా పోషణనిస్తుంది. అంతే కాకుండా దాని సహజ రంగును కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
2. బ్రాహ్మి, భ్రింగ్‌రాజ్:ఈ రెండు ఆయుర్వేద మూలికలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, తెల్ల జుట్టును నివారించడంలో సహాయపడతాయి.
3. కొబ్బరి నూనె: ఈ నూనె జుట్టును లోతుగా తేమగా చేస్తుంది. అంతే కాకుండా జుట్టుకు పసుపు లక్షణాలను అందించడంలో సహాయపడుతుంది.
Also Read: ఊడిన చోటే కొత్త జుట్టు రావాలంటే.. ఉల్లిపాయ జ్యూసే కరెక్ట్ !
పసుపును ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
– జుట్టు యొక్క సహజ మెరుపు తిరిగి వస్తుంది.
– జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.
– తెల్ల జుట్టు సమస్య క్రమంగా తగ్గుతుంది.
– జుట్టు బలంగా మారుతుంది. అంతే కాకుండా తక్కువగా రాలిపోతుంది.
– తలపై చర్మం ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుంది.
– జుట్టుకు రంగు వేయవలసిన అవసరం లేదు.