E-Paper
Advertisement

రోగనిరోధక శక్తి పెరగాలంటే విటమిన్-ఇ ఉండాల్సిందే.. ఈ 5 పదార్థాలతో ఆరోగ్యంగా ఉండండి

రోగనిరోధక శక్తి పెరగాలంటే విటమిన్-ఇ ఉండాల్సిందే.. ఈ 5 పదార్థాలతో ఆరోగ్యంగా ఉండండి
Advertisement

Vitamin E Rich Foods: విటమిన్-ఇ అనేది మన శరీరానికి అత్యంత అవసరమైన ‘ఫ్యాట్-సోల్యూబుల్’ యాంటీ ఆక్సిడెంట్. ఇది కేవలం చర్మ సౌందర్యానికే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచడంలో, కణాల నష్టాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నేటి కలుషిత వాతావరణంలో మన శరీరం ఫ్రీ రాడికల్స్ వల్ల దెబ్బతినకుండా ఉండాలంటే.. విటమిన్-ఇ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం అనివార్యం. గుండె ఆరోగ్యం నుంచి మెరిసే చర్మం వరకు ఈ విటమిన్ ఇచ్చే ప్రయోజనాలు అనేకం. విటమిన్-ఇ అధికంగా లభించే 5 ముఖ్యమైన ఆహార పదార్థాలు, వాటి వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

విటమిన్-ఇ అధికంగా ఉండే 5  ఆహారాలు:
1. బాదం పప్పులు:
విటమిన్-ఇ కి బాదం ఒక సహజ సిద్ధమైన గని. కేవలం ఒక గుప్పెడు బాదం పప్పులు తింటే మన శరీరానికి కావాల్సిన రోజువారీ విటమిన్-ఇ లో దాదాపు 37% అందుతుంది.

Advertisement

ప్రయోజనం: ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

2. పాలకూర:
ఆకుకూరల్లో పాలకూర అత్యంత పోషకమైనది. ఇందులో విటమిన్-ఇ తో పాటు విటమిన్-సి, కె , ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

Advertisement

ప్రయోజనం: ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.అంతే కాకుండా రక్తహీనత రాకుండా కాపాడుతుంది. జీర్ణక్రియకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

3. సన్ ఫ్లవర్ గింజలు:
పొద్దు తిరుగుడు గింజలలో విటమిన్-ఇ నిల్వలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని స్నాక్స్‌గా లేదా సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు.

ప్రయోజనం: ఇవి థైరాయిడ్ గ్రంధి పనితీరును క్రమబద్ధీకరిస్తాయి. అంతే కాకుండా గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. ఇందులోని ఫైబర్ బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది.

4. అవకాడో :
అవకాడోలో విటమిన్-ఇ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి విటమిన్లను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తాయి.

ప్రయోజనం: ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

5. వేరుశనగలు:
సామాన్యుడి బాదంగా పిలవబడే వేరుశనగల్లో విటమిన్-ఇ , ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి.

ప్రయోజనం: ఇవి ఎముకల పుష్టికి, చర్మంపై ముడతలు రాకుండా నివారించడానికి అంతే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి.

Also Read: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే అంతే సంగతులు.. ఈ 5 ప్రాణాంతక వ్యాధులు గ్యారెంటీ !

విటమిన్-ఇ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్: ఇది కణాలను దెబ్బతీసే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తప్పుతుంది.

చర్మ, జుట్టు సంరక్షణ: విటమిన్-ఇ చర్మానికి సహజమైన తేమను ఇస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లను బలోపేతం చేస్తుంది.

రోగనిరోధక శక్తి: ఇది తెల్ల రక్తకణాల ఉత్పత్తిని మెరుగుపరిచి, వైరస్‌లు , బ్యాక్టీరియాలపై పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది.

కంటి ఆరోగ్యం: వయస్సు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యలను నివారించడంలో విటమిన్-ఇ కీలకమైనది.

హార్మోన్ల సమతుల్యత: ఇది ఎండోక్రైన్ , నాడీ వ్యవస్థను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Related News

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

Big Stories

Advertisement
×