E-Paper
Advertisement

Yuvraj Singh: ధోనికి కెప్టెన్సీ ఇస్తే నా ర‌క్తం మ‌రిగిపోయింది..ఆత్మ‌హ‌*త్య చేసుకోవాల‌ని అనుకున్నా !

Yuvraj Singh: ధోనికి కెప్టెన్సీ ఇస్తే నా ర‌క్తం మ‌రిగిపోయింది..ఆత్మ‌హ‌*త్య చేసుకోవాల‌ని అనుకున్నా !
Advertisement

Yuvraj Singh:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( MS DHONI ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెప్టెన్సీలో ఇండియా ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని, దాదాపు 3 ICC ట్రోఫీలు అందించాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ పై తాజాగా యువరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని కంటే సీనియర్ అయిన తనకు కెప్టెన్సీ ఇవ్వకుండా బీసీసీఐ ( BCCI) నిర్ణయం తనను బాధించిందని వెల్లడించారు. ఆ ప్రకటన రాగానే తన రక్తం మరిగిపోయిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించిందని ఎమోషనల్ అయ్యారు యువరాజ్ సింగ్ ( Yuvraj Singh). కానీ ఆ తర్వాత ధోని కెప్టెన్సీలో పనిచేయాల్సి వచ్చిందని వివరించారు.

Also Read: బుమ్రా బౌలింగ్ లో ఫ‌ర్హాన్‌ 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తాడు..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా పాకిస్తాన్ బార్డ‌ర్‌లో తిరుగుతా

ధోనికి కెప్టెన్సీ ఇస్తే నా ర‌క్తం మ‌రిగిపోయింది

Advertisement

2007 రాహుల్ ద్రావిడ్ శకం ముగిసిన తర్వాత మహేంద్రసింగ్ ధోని టీమిండియా కెప్టెన్ గా ఎదిగారు. అదే సమయంలో టి20 ప్రపంచ కప్ టైటిల్ కూడా ఇండియాకు అందించిన క్రికెటర్ గా మహేంద్రసింగ్ ధోని చరిత్ర సృష్టించారు. ఈ తరుణంలోనే మూడు ఫార్మాట్లకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా నియామకం అయ్యాడు. అప్పటికే సీనియర్లుగా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్లను కాదని మహేంద్రసింగ్ ధోని నమ్మారు బీసీసీఐ పెద్దలు. అయితే ఈ విషయంపై తాజాగా యువరాజ్ సింగ్ స్పందించారు.

తనను కాదని ధోనీకి కెప్టెన్సీ ఇవ్వగానే షాక్ అయ్యానని తెలిపారు. ఆ సమయంలో రక్తం మరిగిపోయిందని బాంబు పేల్చారు. ఎక్కడో ఝార్ఖండ్ నుంచి వచ్చి ఒకసారిగా ధోని కెప్టెన్ గా కావడం మిరాకిలని.. ఎవరు ఊహించని పరిణామం అని తెలిపారు యువరాజ్ సింగ్. ఆ సమయంలో హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఉన్నారని గుర్తు చేశారు. వాళ్ల తర్వాత నేనే సీనియర్ ను.. అప్పటికే వైస్ కెప్టెన్సీ అనుభవం తనకు ఉందని గుర్తు చేశారు. అయినప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి… తనకు కాకుండా ధోనికి కెప్టెన్సీ ఇచ్చిందన్నారు. దట్టు కోసం ఎన్నో రోజులుగా కష్టపడ్డ తనకు మాత్రం పదవి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఇకపై ఐపిఎల్ లో ప్రదర్శన బట్టి, టీమిండియా కెప్టెన్సీ ఇవ్వకూడదని కోరారు.

ధోనికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన యువ‌రాజ్‌

Advertisement

కపిల్‌, ధోనికి క్షమాపణలు చెప్తాన‌ని తాజాగా వెల్ల‌డించారు యువరాజ్‌ సింగ్‌. యువీకి కెప్టెన్సీ చాన్స్‌ రాకపోవడం వెనుక ధోనీ కుట్ర ఉందని.. యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ పలుమార్లు ఆరోపణలు చేసిన సంగ‌తి తెలిసిందే. అసలు యువీని భారత జట్టు నుంచి తప్పించింది కూడా ధోనీయేనన్నారు యోగ్‌రాజ్‌ సింగ్‌. కపిల్ దేవ్ హయాంలో తనకు అన్యాయం జరిగిందన్నారు. అయితే, దీనిపై కపిల్‌, ధోనికి క్షమాపణలు చెప్తాన‌ని తాజాగా స్ప‌ష్టం చేశారు యువరాజ్‌ సింగ్‌.

 

Also Read: IPL 2026: KKRపై స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విజ‌యం..పాకిస్తాన్ లో సంబ‌రాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×