హైదరాబాద్ దమ్ బిర్యాని తిని ఉంటారు. అలాగే లక్నో బిర్యానీ, ధిండిగల్ బిర్యాని ఇలా రకరకాల బిర్యానీలు తిని ఉంటారు. ఈసారి ఆఫ్గానీ స్టైల్లో బిర్యానీని వండుకొని తిని చూడండి. ఇది అద్భుతంగా ఉంటుంది. పైగా కొత్తగా అనిపిస్తుంది. దీని రుచి తెలియాలంటే మేము ఇక్కడ చెప్పిన పద్ధతుల్లో బిర్యానీ వండి చూడండి. దీన్ని మటన్ తో వండుతారు. ఇది వండడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కానీ రుచిగా మాత్రం ఉంటుంది.
కావలసిన పదార్థాలు
నూనె – అరకప్పు
ఉప్పు – రుచికి సరిపడా
పచ్చిమిర్చి – ఐదు
క్యారెట్లు – మూడు
ఉల్లిపాయలు – ఐదు
మటన్ – ఒక కిలో
బాస్మతి బియ్యం – ఒక కిలో
టమోటోలు – రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు – మూడు స్పూన్లు
పచ్చిమిర్చి – నాలుగు
గరం మసాలా – రెండు స్పూన్లు
డ్రై ఫ్రూట్స్ – గుప్పెడు
ఆఫ్గానీ బిర్యానీ రెసిపీ
1. మటన్ ముక్కలను మీడియం సైజులో కట్ చేసుకోవాలి. వాటిని ఒక గిన్నెలో వేయాలి.
2. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, గరం మసాలాలో, రెండు పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.
3. అలాగే నీరు కూడా చేసి బాగా కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టాలి.
4. తర్వాత మిశ్రమాన్ని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
5. ఉడికిన మాంసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మటన్ ఉడికిన నీటిని స్టాక్ అంటారు.
6. ఆ స్టాక్ ను కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ వండేందుకు పెద్ద హండీ స్టవ్ మీద పెట్టాలి.
7. అందులో నూనె వేసి నిలువుగా తిరిగిన ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
8. తర్వాత మిగిలిన గరం మసాలాను వేయించుకోవాలి.
9. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న మటన్‌ను వేసి బాగా కలుపుకోవాలి.
10. అలాగే టమాటో ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.
11. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయించాలి. ఈ మొత్తం బాగా ఉడకనివ్వాలి.
12. ఆ తర్వాత బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలపాలి.
13. మటన్ ఉడికించిన నీటిని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి.
14. ఇప్పుడు బియ్యం ఉడకడానికి ఎంత నీరు సరిపడుతుందో అంత నీటిని వేసి పైన మూత పెట్టి 10 నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలి.
15. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్టానీ స్టైల్ లో బిర్యాని చేయాలంటే వాటి పైన డ్రై ఫ్రూట్స్ వేయాల్సి వస్తుంది.
16. అయితే బిర్యానీలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినేవారి సంఖ్య చాలా తక్కువ. కాబట్టి మీకు నచ్చకపోతే డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాల్సిన అవసరం లేదు.
17. క్యారెట్ లను మాత్రం కోసి పైన చల్లుకోవాలి. అలాగే బాదం పప్పులను కూడా చల్లుకోవచ్.చు దీన్ని వేడి వేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది.
బిర్యానీ మొఘల్ వంశం నుంచే వచ్చిందని చెప్పుకుంటారు. అందుకే ఆఫ్గానీ బిర్యాని కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సాధారణ బిర్యానీతో పోలిస్తే ఆఫ్గనీ బిర్యానీలో కొత్తిమీర, పుదీనా వంటి వాడము. అలాగే దీనిలో గరం మసాలా పొడి వేస్తే సరిపోతుంది. మసాలా దినుసులు విడివిడిగా వేయాల్సిన అవసరం లేదు. ఆఫ్గానీ బిర్యాని వండడానికి కావలసిన పదార్థాలు తక్కువగానే ఉంటాయి. కానీ మటన్ ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువమంది ఇలాగే బిర్యానీని వండుకుంటారు. అక్కడ నీటి కరువు కూడా ఉండడంతో మటన్ ఉడికించిన నీటిని బియ్యాన్ని ఉడికించడానికి కూడా వినియోగిస్తారు. దీనివల్ల పసుపు, కారం కూడా సెపరేట్ గా వేయాల్సిన అవసరం లేదు. ఆ మటన్ ఉడికించిన నీటి రంగే అన్నానికి కూడా వస్తుంది. ఆఫ్గానీ బిర్యాని ఒక్కసారి రుచి చూశారంటే మీరు విడిచి పెట్టలేరు. మేము చెప్పిన పద్ధతిలో ఒకసారి వండి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.