BigTV English

Nani -Sujeeth: ఘనంగా నాని సుజీత్ కొత్త సినిమా పూజ వేడుక..మరో హిట్ లోడింగ్!

Nani -Sujeeth: ఘనంగా నాని సుజీత్ కొత్త సినిమా పూజ వేడుక..మరో హిట్ లోడింగ్!

Nani -Sujeeth: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth)ప్రస్తుతం ఓజీ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లోనే ఉన్నారు. ఇలా అభిమానులు ఓజి సినిమా (OG Movie)నుంచి బయటపడకుండానే ఈయన మరో కొత్త సినిమాను ప్రారంభించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రన్ రాజా రన్ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సుజీత్ అనంతరం. ప్రభాస్ తో సాహో సినిమా చేసి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ప్రభాస్ సినిమా తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజి సినిమా ఎంతో విజయవంతం అయ్యింది.


నాని సుజీత్ సినిమా ప్రారంభం..

ఇక ఈ సినిమా తర్వాత సుజిత్ తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని(Nani)తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నేడు ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సుజిత్ నాని కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోయే ఈ సినిమా “బ్లడీ రోమియో”(Bloody Romeo) అనే టైటిల్ తో షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారు. ఇక ఈ సినిమా యాక్షన్ తో కూడిన డార్క్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తికావడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

క్రిస్మస్ ను టార్గెట్ చేసిన బ్లడీ రోమియో..

ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందంతోపాటు ప్రముఖ స్టార్ హీరో వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌కు చెందిన వెంకట్ బోయనపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇక వచ్చే ఏడాది క్రిస్మస్ నాటికి ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలను రచించారు. ఇలా క్రిస్మస్ పండుగను టార్గెట్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకోనుంది. ఇక వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ ఓజి 2 షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.


8 భాషలలో ది ప్యారడైజ్..

ఈ నేపథ్యంలోనే బ్లడీ రోమియో సినిమా షూటింగ్ పనులను శరవేగంగా నిర్వహించేలా చిత్రబృందం ప్లాన్ చేశారు . ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ (The Paradise)సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు ఈ సినిమా 80% షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసుకొని నాని సుజీత్ సినిమాతో బిజీ కానున్నారు. ఇటీవల నాని సైతం వరస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మరో హిట్ సినిమా లోడింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేశారు? ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Varun Tej -Lavanya: ఘనంగా మెగా వారసుడి నామకరణ వేడుక..ఏం పేరు పెట్టారో తెలుసా?

Related News

Little Hearts 2 : లిటిల్ హార్ట్స్ 2 ప్రకటించిన డైరెక్టర్.. హీరో హీరోయిన్లు మారిపోయారా?

Rahul Ramakrishna: కేటీఆర్, కేసీఆర్ మీరే రావాలి.. నన్ను చంపేయండి, రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్!

Shahid Kapoor: నా పిల్లలు ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదు.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు!

Raashii Khanna: స్క్రిప్ట్ ముఖ్యం కాదు… పవన్ కళ్యాణ్ అంటే సరిపోతుంది 

Varun Tej -Lavanya: ఘనంగా మెగా వారసుడి నామకరణ వేడుక..ఏం పేరు పెట్టారో తెలుసా?

Aswini Dutt: ఘనంగా నిర్మాత అశ్వినీ దత్ కుమార్తె నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

Sree Vishnu: హిట్ కాంబో రిపీట్ – శ్రీ విష్ణు కొత్త సినిమా మీద హైప్

Big Stories

×