Sabudana Recipes: సాబుదానాను వివిధ రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఉపవాసం సమయంలో సాబుదానాతో చేసిన ఆహార పదార్థాలను తింటుంటారు. ఇదిలా ఉంటే సాబుదానాతో వంటకాలు తయారు చేయడం కూడా చాలా సులభం. 15 నిమిషాల్లోనే తయారు చేయగల 6 వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. సాబుదానా ఖిచ్డీ (Sabudana Khichdi)
కావాల్సిన పదార్థాలు:
సాబుదానా – 1 కప్పు (6-8 గంటల పాటు నానబెట్టినది)
ఆలూ (బంగాళాదుంప) – 1 (ఉప్పులో వేపినది లేదా ఉడికించినది)
పచ్చిమిర్చి – 2 (సన్నగా కోసినవి)
జీలకర్ర – 1 టీస్పూన్
మినప్పప్పు – 1 టీస్పూన్
పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు (వేయించి పొడి చేయాలి)
ఉప్పు – రుచికి సరిపడా
నిమ్మరసం – 1 టీస్పూన్
కొత్తిమీర – కాస్త
తయారీ విధానం:
నానబెట్టిన సాబుదానాను వడకట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్‌లో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి వేయించి ఆలూ ముక్కలు వేసి వేపాలి. తరువాత అందులోనే సాబుదానా, ఉప్పు, వేరుశనగ పొడి వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర వేసి ముందుగా సర్వ్ చేయాలి.
2. సాబుదానా వడ (Sabudana Vada)
కావాల్సిన పదార్థాలు:
సాబుదానా – 1 కప్పు (నానబెట్టినది)
బంగాళదుంపలు – 2 (ఉడికించినవి, ముద్దగా చేసినవి)
పచ్చిమిర్చి – 2
ఇంగువ, జీలకర్ర- 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
కోతిమీర, పెరుగు (ఇష్టమైతే)
నూనె – సరిపడా
తయారీ విధానం:
అన్ని పదార్థాలను ఒక పాత్రలో వేసి కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న వడలుగా చేసి.. నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయాలి.
చట్నీ లేదా పెరుగుతో సర్వ్ చేయండి. చాలా రుచిగా ఉంటాయి.
3. సాబుదానా పాయసం:
కావాల్సిన పదార్థాలు:
సాబుదానా – 1/2 కప్పు
పాలు – 2 కప్పులు
చక్కెర – 1/2 కప్పు లేదా రుచికి తగినంత
యాలకుల పొడి – 1/4 టీస్పూన్
డ్రై ఫ్రూట్స్ – ఇష్టమైతే
తయారీ విధానం:
ముందుగా సాబుదానా నీళ్లలో ఉడకబెట్టాలి.తర్వాత పాలను వేడి చేసి అందులో ఉడికిన సాబుదానా వేసి, చక్కెర వేసి ఉడికించాలి. ఆ తర్వాత కాస్త యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి చివరగా సర్వ్ చేయాలి.
4. సాబుదానా తలిపిండి:
(మహారాష్ట్రలో ఫేమస్ – ఉపవాసాల సమయంలో తింటారు)
కావాల్సిన పదార్థాలు:
సాబుదానా – 1 కప్పు (6 గంటలపాటు నానబెట్టినది)
ఉడికించిన బంగాళదుంప – 1 (తురిమినది )
పల్లీల పొడి – 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
జీలకర్ర, ఉప్పు – తగినంత
కొత్తిమీర – ఇష్టమైతే..
తయారీ విధానం:
అన్నీ పదార్థాలు కలిపి మెత్తటి ముద్ద చేసుకోండి. ప్లాస్టిక్ కవర్ లేదా వేపే తవ్వపై తడి చేత్తో గోధుమరొట్టెలా ఒత్తాలి. మధ్యలో చిన్న రంధ్రం చేసి, నూనె వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా వేపాలి. అనంతరం పెరుగు లేదా చట్నీతో సర్వ్ చేయండి.
Also Read: రసాయనాలతో.. పండించిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలి ?
5. సాబుదానా లడ్డూ:
కావాల్సిన పదార్థాలు:
సాబుదానా – 1 కప్పు
షుగర్ – 3/4 కప్పు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి – 1/4 టీస్పూన్
డ్రై ఫ్రూట్స్ – ఇష్టమైతే..
తయారీ విధానం:
ముందుగా సాబుదానాను కాస్త వేయించి, మిక్సీలో పొడి చేయాలి. తర్వాత షుగర్ కూడా పొడి చేసుకోవాలి. అనంతరం ఒక బౌల్‌లో సాబుదానా పొడి, షుగర్ పొడి, యాలకుల పొడి కలిపి నెయ్యితో కలిపి లడ్డూలుగా చేయాలి. దీనిని డ్రై ఫ్రూట్స్ తో అలంకరించవచ్చు.