Raashii Khanna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే విపరీతమైన వైబ్ ఉండేది. ఇప్పటికీ కూడా ఆ వైబ్ ఉంది. కానీ అది చాలా మేరకు తగ్గింది. దీనికి కారణం కేవలం సినిమాలు మాత్రమే చేసే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం. దీనివలన కొంత ఫ్యాన్ బేస్ తగ్గింది అనేది కొంతమంది ఒప్పుకోలేని వాస్తవం.
పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సినిమాలు హిట్ అవ్వకపోయినా కూడా తన రెమ్యూనరేషన్ విపరీతంగా పెరిగింది. రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా క్రేజ్ కూడా విపరీతంగా పెరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి ఒక సక్సెస్ఫుల్ సినిమా పవన్ కళ్యాణ్ నుంచి వస్తే చూద్దాం అనుకున్న అభిమానులకు ఓజీ సినిమా రూపంలో కోరిక తీరిపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రాశి కన్నా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి రాశి కన్నా ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఈ సినిమా గురించి హరీష్ శంకర్ నాకు ఫోన్ చేసినప్పుడు నేను కథ గురించి పెద్దగా ఆలోచించలేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా అనగానే ఓకే చేశాను.
హరీష్ శంకర్ కాల్ చేసినప్పుడు నాకు స్క్రిప్ట్ కూడా వద్దు నేను సినిమా చేస్తాను అని చెప్పాను. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని కూడా నేను పవన్ కళ్యాణ్ గారి కోసమే చేశాను. చాలామందికి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి అనే డ్రీమ్ ఉంటుంది. నాకు కూడా నేను ఈ సినిమా చేయడంతో నా డ్రీమ్ ఫుల్ ఫీల్ అయిపోయింది అంటూ రాశి ఖన్నా చెప్పింది.
నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా విన్నాను. అలానే చాలామంది నాకు చెప్పారు కూడా, నేను ఆయనతో పని చేస్తున్నప్పుడు కూడా హంబుల్ గా ఉన్నారు. ఆయన స్వాగ్ కూడా అనుకోకుండా ఉంది. నిజంగా ఆయనతో పని చేయటం నేను బ్లెస్సింగ్ లా ఫీల్ అవుతున్న. ఆయన చాలా బుక్స్ చదువుతారు నాకు కూడా చాలా బుక్స్ గురించి చెప్పారు. ఆయనకు విపరీతమైన నాలెడ్జ్ ఉంది. ఆయనకు ఆడియన్స్ అంటే చాలా ఇష్టం. కొంతమందికి సినిమాలు అంటే పిచ్చి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారికి జనాలు అంటే పిచ్చి. అంటూ రాశి ఖన్నా తెలిపారు.
Also Read: Sree Vishnu: హిట్ కాంబో రిపీట్ – శ్రీ విష్ణు కొత్త సినిమా మీద హైప్