BigTV English

Aghori couple: ఆపని చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం.. అఘోరి కపుల్ వార్నింగ్

Aghori couple: ఆపని చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం.. అఘోరి కపుల్ వార్నింగ్

పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగు పెట్టిన అఘోరి కపుల్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంకా తమని వేధిస్తే, వెంటాడితే తాము ఆత్మహత్య చేసుకోడానికి రెడీ అంటూ అఘోరి, వర్షిణి దంపతులు ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. తామేదో ఈ విషయాన్ని తమాషాగా చెప్పడం లేదని, ఎవర్నీ బెదిరించడానికి ఈ వీడియో రిలీజ్ చేయలేదని.. తమ వెంటపడితే కచ్చితంగా ప్రాణ త్యాగం చేస్తామని చెప్పారు అఘోరి, వర్షిణి. పెట్రోల్ రెడీగా ఉందని, వ్యాన్ తో పాటు తామిద్దరం నిప్పంటించుకుని తగలబడిపోతామంటూ హెచ్చరించారు.


మమ్మల్ని వదిలేయండి..
తమ మానాన తాము బతుకుతుంటే ఇంకా తమ వెంట ఎందుకు పడతారంటూ మీడియాని, సోషల్ మీడియాని ప్రశ్నించారు అఘోరి. తాము తెలుగు రాష్ట్రాల్లోనే ఉండదలచుకోలేదని, ఉత్తరాఖండ్ వెళ్తున్నామని చెప్పారు. ఉత్తరాఖండ్ లోనే ఉండిపోతామని, ఇకపై తెలుగు రాష్ట్రాలకు రాబోమని చెప్పారు. ఇక్కడ లేకపోయినా తమను కొంతమంది కావాలని టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. తమ జీవితాల్లోకి తొంగి చూడాలనుకోవద్దని, ఇకనైనా ట్రోలింగ్ ఆపాలని, తమ గురించి తప్పుడు ప్రచారం ఆపాలని అన్నారు అఘోరి. కాదు, కూడదని తమ దగ్గరకు వచ్చినా, తమ గురించి ఎంక్వయిరీ చేసినా, తమని కలవాలని చూసినా ఆత్మహత్యే శరణ్యం అని అన్నారు.

నేనిక్కడ హ్యాపీ..
తాను అఘోరి వద్ద హ్యాపీగా ఉన్నానని, తన జీవితం బాగుందని చెప్పారు వర్షిణి. తనపై లేనిపోని సింపతీ చూపించవద్దన్నారు. తాను బాగానే ఉన్నానని, తన బాగు కోరుకునేవారెవరూ తమ వద్దకు రావద్దని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉత్తరాఖండ్ వెళ్లిపోతున్నామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సమస్యలున్నాయని, మీడియా, సోషల్ మీడియా వాటిపై దృష్టి పెట్టాలని, ఎంతకాలం తమ వెంట పడతారని ప్రశ్నించారు. అఘోరిపై పెట్టిన తప్పుడు కేసులకు సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. అఘోరి మొదటి భార్య అంటూ బయటకొచ్చిన మహిళ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అఘోరి వద్ద తన జీవితం బాగుందన్నారు. ఎవరైనా తమ జోలికి వస్తే ప్రాణ త్యాగం చేస్తామని హెచ్చరించారు.

అప్పుడు అటెన్షన్.. ఇప్పుడు డైవర్షన్..
గతంలో అఘోరి మీడియా అటెన్షన్ కోసం తపించేవారు. తన పెళ్లి వరకు ఆమె మీడియా, సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. సడన్ గా ఆమె ఇప్పుడు తన భార్య వర్షిణితో కలసి ఉత్తరాఖండ్ వెళ్లిపోతున్నట్టు చెప్పారు. మీడియా, సోషల్ మీడియాలో తమపై ట్రోలింగ్ ఆపాలన్నారు. జీవితాంతం కేదార్ నాథ్ లో ఉంటామని, ఇకనైనా తమ గురించి ఆలోచించడం మానేయాలంటున్నారు. అంతే కాదు, ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలంటూ మీడియాకి ఉచిత సలహా కూడా ఇచ్చారు అఘోరి. పెట్రోల్ ఒంటిపై పోసుకుని గతంలో కూడా అఘోరి ఒక గుడి వద్ద హడావిడి చేశారు. ఇప్పుడు మళ్లీ పెట్రోల్ బాటిల్ అంటూ ఆమె సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ప్రాణ త్యాగం అంటూ వీడియో విడుదల చేశారు. మరి ఈ వీడియోని కూడా సోషల్ మీడియా ట్రోల్ చేస్తుందా..? లేక వారిద్దరి వ్యవహారానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా..? వేచి చూడాలి.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×