E-Paper
Advertisement

Vitamin D: మీ ఎముకలు బలహీనపడుతున్నాయా? ఈ లక్షణాలను గమనించండి!

Vitamin D: మీ ఎముకలు బలహీనపడుతున్నాయా? ఈ లక్షణాలను గమనించండి!
Advertisement

Vitamin D: ప్రస్తుత కాలంలో ‘విటమిన్ డి లోపం’ అనేది ఒక నిశ్శబ్ద మహమ్మారిలా విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఒక బిలియన్ ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. మన శరీరం కాల్షియంను గ్రహించి ఎముకలను బలంగా ఉంచాలన్నా.. రోగ నిరోధక శక్తి పెరగాలన్నా.. విటమిన్ డి అత్యవసరం. దీనిని ‘సన్‌షైన్ విటమిన్’ అని కూడా పిలుస్తారు. అయితే.. మారుతున్న లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, ఎండ తగలకపోవడం వల్ల చాలా మందిలో.. ఈ విటమిన్ స్థాయిలు పడిపోతున్నాయి.

విటమిన్ డి లోపం:
విటమిన్ డి అనేది ఇతర విటమిన్ల లాగా కేవలం ఆహారం ద్వారా.. మాత్రమే లభించేది కాదు. ఇది మన శరీరంలో ఒక హార్మోన్ లాగా పనిచేస్తుంది. దీని లోపానికి దారితీసే అనేక అంశాలు కూడా ఉన్నాయి.

Advertisement

1. సూర్యరశ్మి తగినంతగా తగలకపోవడం:
విటమిన్ డి లోపానికి అత్యంత ప్రధాన కారణం సూర్యరశ్మికి దూరంగా ఉండటం. మన చర్మం సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత బి కిరణాల సమక్షంలో.. విటమిన్ డిని తయారు చేసుకుంటుంది.

ఇండోర్ లైఫ్ స్టైల్ : ఆఫీసుల్లో ఏసీ గదుల్లో పని చేయడం, ఖాళీ సమయంలో మొబైల్స్ లేదా టీవీలకు పరిమితం అవ్వడం వల్ల ఎండ శరీరానికి తగలడం లేదు.

Advertisement

సన్‌స్క్రీన్ వాడకం: బయటకు వెళ్ళేటప్పుడు ఎస్పీఎఫ్.. ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్లు రాయడం వల్ల చర్మం విటమిన్ డిని తయారు చేసే ప్రక్రియ 95 శాతం వరకు ఆగిపోతుంది.

2. ఆహారపు అలవాట్లు:
చాలా తక్కువ ఆహార పదార్థాల్లో.. మాత్రమే విటమిన్ డి సహజంగా ఉంటుంది.

వెజ్ ఫుడ్: విటమిన్ డి ప్రధానంగా చేపలు, గుడ్డులోని సొన, కాలేయం వంటి నాన్ ఫుడ్ ఉంటుంది. కేవలం వెజ్ ఫుడ్ మాత్రమే తీసుకునే వారిలో.. తగినంత పోషకాలు అందక ఈ లోపం తలెత్తుతుంది.

పాలు, పాల పదార్థాలు: పాలు లేదా పెరుగు వంటి పదార్థాలను తక్కువగా తీసుకోవడం వల్ల కూడా లోపం ఏర్పడవచ్చు.

3. భౌగోళిక, పర్యావరణ కారణాలు:
మనం నివసించే ప్రాంతం కూడా.. విటమిన్ డి స్థాయిలను నిర్ణయిస్తుంది.

కాలుష్యం: నగరాల్లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం సూర్యరశ్మిని నేరుగా భూమికి చేరనీయకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల చర్మానికి అవసరమైన కిరణాలు అందవు.

ఎక్కువ ఎత్తులో ఉండటం: ఎత్తైన భవనాల్లో లేదా ఎల్లప్పుడూ నీడలో.. ఉండే ప్రాంతాల్లో నివసించే వారికి కూడా ఈ సమస్య ఉంటుంది.

4. శారీరక , జీవసంబంధిత కారణాలు:
చర్మ ఛాయ: చర్మం ముదురు రంగులో ఉన్న వారిలో ‘మెలనిన్’ ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యరశ్మి నుంచి విటమిన్ డి తయారయ్యే వేగాన్ని తగ్గిస్తుంది. అందుకే తెల్లగా ఉండేవారితో.. పోలిస్తే, నల్లగా ఉండేవారు ఎక్కువ సమయం ఎండలో ఉండాల్సి ఉంటుంది.

ఊబకాయం: విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్. శరీరంలో కొవ్వు కణాలు ఎక్కువగా ఉన్నప్పుడు, అవి విటమిన్ డిని తమలో బంధించి రక్తంలోకి విడుదల చేయవు. దీని వల్ల అధిక బరువు ఉన్నవారిలో విటమిన్ డి లోపం కనిపిస్తుంది.

వయస్సు: వయస్సు పెరిగే కొద్దీ చర్మం విటమిన్ డిని తయారు చేసే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతుంది.

5. ఆరోగ్య సమస్యలు:
కొన్ని సార్లు మనం ఆహారం తీసుకున్నప్పటికీ.. శరీరం దానిని గ్రహించలేదు.

జీర్ణకోశ సమస్యలు: సెలియక్ వ్యాధి, క్రోన్’స్ వ్యాధి వంటివి ఉన్నవారిలో పేగులు విటమిన్ డిని గ్రహించలేవు.

కిడ్నీ, కాలేయ వ్యాధులు: విటమిన్ డిని శరీరం వాడుకునే రూపంలోకి మార్చడానికి కాలేయం, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి. ఇవి దెబ్బతింటే విటమిన్ డి లోపం తప్పదు.

Also Read: మీ ఎముకలు బలహీనపడుతున్నాయా? ఈ లక్షణాలను గమనించండి!

విటమిన్ డి లోపం వల్ల కలిగే లక్షణాలు:
ఎప్పుడూ అలసటగా.. నీరసంగా అనిపించడం.

వెన్నునొప్పి, ఎముకల నొప్పులు.

తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడటం.

మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్.

గాయాలు త్వరగా మానకపోవడం.

నివారణ మార్గాలు:
సూర్యరశ్మి: ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం 20-30 నిమిషాలు ఎండలో గడపాలి.

సరైన ఆహారం: చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు , పాలు, ఆరెంజ్ జ్యూస్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.

సప్లిమెంట్లు: లోపం ఎక్కువగా ఉన్నప్పుడు.. డాక్టర్ సలహా మేరకు విటమిన్ డి టాబ్లెట్లు లేదా సిరప్ తీసుకోవాలి.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×