E-Paper
Advertisement

Happy Raj: జీవీ ‘హ్యాపీ రాజ్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Happy Raj: జీవీ ‘హ్యాపీ రాజ్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
Advertisement

Happy Raj: స్టార్ కంపోజర్ కమ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) అప్ కమింగ్ మూవీ ‘హ్యాపీ రాజ్’ (Happy Raj). హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ (Maria Raja Elanchezian) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. తెలుగమ్మాయి, ‘మ్యాడ్’ ఫేం శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మార్చి 27 తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను ఏర్పడేలా చేసిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ (Happy Raj) ఎలా ఉందంటే..

Also Read- S.S.Thaman:  ఎస్ ఎస్ తమన్ అసలు పేరేంటో తెలుసా..పేరు మార్పుకు కారణం అదేనా?

తండ్రి పాత్ర హైలెట్

Advertisement

హీరో జీవీ ప్రకాష్ కుమార్ రీల్స్‌తో మొదలైన ఈ ట్రైలర్‌లో.. ఐ లవ్ యు 1, 2, 3 అంటూ అమ్మాయిల వెంట ప్రేమ అంటూ పడే యువకుడిలా వెరైటీ గెటప్‌లో హీరోని ప్రజంట్ చేశారు. అమ్మాయిలు హీరోని ఇష్టపడటానికి కారణాలు చెప్పించి, ఒక అమ్మాయి హీరోకి లవ్ లెటర్ ఇచ్చినట్లుగా చూపించారు. మరోవైపు హీరో తండ్రి పాత్రను హైలెట్ చేస్తూ.. ఆ పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్‌ని పరిచయం చేశారు. హీరో తండ్రి పాత్ర ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ అనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. అంతేకాదు, తండ్రి పాత్రని చూపించిన తీరు కూడా చాలా వైవిధ్యంగా ఉంది. ఊరిలో ఉన్న అమ్మాయిలు ఎవరూ పడటం లేదని, పొరుగూరు అమ్మాయిలను ట్రై చేయమనే సలహాలు హీరో వినడం మొదలు పెట్టగానే.. హీరో లైఫ్‌లోకి హీరోయిన్ ఎంటరైంది.

Also Read- Dhurandhar 2: మొదటి రెండు రోజుల్లోనే 5 రికార్డులు బ్రేక్ చేసిన ధురంధర్ 2..!

లైఫ్‌లో అమ్మాయి శపిస్తే

Advertisement

ఇంత వరకు లవ్ చేసిన అమ్మాయిలందరూ హ్యాండ్ ఇచ్చారని హీరో చెప్పే డైలాగ్, ఆ డైలాగ్ వస్తున్నప్పుడు హీరోయిన్‌ని చూపించే విధానం యూత్‌ని బాగా ఆకర్షించేలా ఉంది. హీరోతో హీరోయిన్ చాలా దూరం వెళ్లిపోయిన తర్వాత.. ‘మీ అమ్మనాన్నలని మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడమను’ అని హీరోయిన్ అడుగుతుంది. అసలు కథ ఇక్కడే టర్న్ తీసుకుంటుందనేది ట్రైలర్ చూసే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. హీరోయిన్ ఫాదర్‌గా అబ్బాస్ ఎంట్రీ అదిరింది. అక్కడి నుంచి ప్రతి షాట్.. సినిమాపై ఆసక్తిని కలిగించేలా మేకర్స్ ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ఫ్రాడ్ ఫ్యామిలీ అంటూ అబ్బాస్ ఫైర్ అవడం, హీరోని హీరోయిన్ తిట్టడం.. ఫ్యామిలీ ఫైటింగ్.. ఇలా హుషారు హుషారుగా ట్రైలర్ నడిచింది. లైఫ్‌లో అమ్మాయి శపిస్తే, అది కచ్చితంగా జరుగుతుందనేలా ఓ సన్నివేశాన్ని ట్రైలర్ మొత్తం చూపిస్తూనే ఉన్నారు. చివరిలో హిందీ డైలాగ్స్ మరో హైలెట్. తండ్రి పాత్రని హీరో తిట్టడం, అదే టైమ్‌లో భయపడినట్లుగా చూపించడం చూస్తుంటే.. ఈ సినిమాలో మస్త్ షేడ్స్ ఉన్నాయనేది అర్థమవుతోంది. ఓవరాల్‌గా ట్రైలర్ సినిమాపై ఇంప్రెస్ కలిగేలా చేయడంలో మాత్రం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.

Also Read- Chiranjeevi: ఎన్టీఆర్ అంటే ఏంటో చెప్పేసిన మెగాస్టార్.. మరిచిపోయినా మస్త్ కవర్ చేశారుగా!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×