E-Paper
Advertisement

రాత్రి డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తే షుగర్ తగ్గుతుందా? ఎంత సేపు నడవాలి?

రాత్రి డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తే షుగర్ తగ్గుతుందా? ఎంత సేపు నడవాలి?
Advertisement

Walking After Dinner| రాత్రి భోజనం చేసిన వెంటనే చాలా మంది సోఫాలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటారు. అయితే వైద్య నిపుణులు భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఇది భోజనం తర్వాత పెరిగే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీర జీవక్రియను కూడా చురుకుగా ఉంచుతుంది.

భోజనం తర్వాత నడిస్తే బ్లడ్ షుగర్ తగ్గుతుందా?

దీని సమాధానం అవును. రాత్రి భోజనం చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు వాకింగ్ చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు ఈ అలవాటు మరింత ఉపయోగపడుతుంది. నడక వల్ల కండరాలు శరీరంలోని గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించుకుంటాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి.

భోజనం తర్వాత శరీరంలో ఏం జరుగుతుంది?

Advertisement

మన శరీరం ఆహారంలోని కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఈ గ్లూకోజ్ రక్తంలోకి చేరి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఆ తర్వాత ఇన్సులిన్ గ్లూకోజ్‌ను కణాల్లోకి పంపిస్తుంది. అయితే మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో ఈ ప్రక్రియ సరిగా పనిచేయదు. అందువల్ల వారి రక్తంలో చక్కెర (గ్లూకోజ్) ఎక్కువసేపు ఉంటుంది.

భోజనం తర్వాత నడక ఎందుకు మంచిది?

భోజనం తర్వాత చేసే నడక శరీరంలోని పెద్ద కండరాలను చురుకుగా పనిచేయిస్తుంది. దీంతో కండరాలు రక్తంలోని గ్లూకోజ్‌ను ఎక్కువగా వినియోగిస్తాయి. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణక్రియ సాఫీగా జరిగేలా సహాయపడుతుంది.

ఎంతసేపు నడవాలి?

Advertisement

నిపుణుల ప్రకారం భోజనం తర్వాత 10 నుంచి 30 నిమిషాలు నడవడం మంచిది. భోజనం చేసిన 30 నుంచి 60 నిమిషాల మధ్య నడక ప్రారంభించడం ఉత్తమం. వేగంగా కాకుండా సౌకర్యంగా నడవాలి. ప్రతిరోజూ ఈ అలవాటు కొనసాగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

డయాబెటీస్‌ నివారించడంలో ఉపయోగమా?

రోజూ భోజనం తర్వాత నడిచే అలవాటు ప్రీడయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. అయితే ఇప్పటికే మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు వ్యాయామం చేయాలి.

ఉదయం వాకింగ్ కంటే రాత్రి నడక మంచిదా?

ఉదయం వేళ వాకింగ్ చేస్తే గుండె ఆరోగ్యం, శారీరక దృఢత్వానికి ఉపయోగపడుతుంది. అయితే రాత్రి భోజనం తర్వాత చేసే నడక రక్తంలో చక్కెర నియంత్రణకు మరింత సహాయపడుతుంది. అందువల్ల రెండింటికీ వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి.

ఎవరికి ఎక్కువ ప్రయోజనం?

భోజనం తర్వాత నడక వల్ల ప్రీడయాబెటిస్ ఉన్నవారు, టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు, వృద్ధులు, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారు ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఈ అలవాటును పాటిస్తే భవిష్యత్తులో మధుమేహ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తొలిసారి తీసుకుంటున్నారా? ముందు ఈ 4 విషయాలు తప్పక చెక్ చేయండి

అలవాటు చేసుకోవడానికి చిట్కాలు

ప్రతిరోజూ 10 నిమిషాల వాకింగ్‌తో ప్రారంభించండి. భోజనం చేసిన వెంటనే పడుకోకుండా నడవండి. కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్ చేస్తే ఆసక్తి పెరుగుతుంది. స్టెప్ ట్రాకర్ ఉపయోగించడం కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

జాగ్రత్తలు

డిన్నర్ హెవీగా చేసిన వెంటనే వేగంగా నడవకండి. కేవలం వ్యాయామం చేస్తే సరిపోతుందని భావించి అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవద్దు. భోజనం తర్వాత గంటల తరబడి కూర్చోవడం కూడా మంచిది కాదు.

Related News

నరనరాల్లో టెస్టోస్టెరాన్.. ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న విషయాలకే కోపపడతారు

మొటిమలతో ఇబ్బందిపడుతున్నారా? రోజూ ఈ డ్రింక్ తాగితే మచ్చలు, మొటిమలు మాయం

వేగంగా తినడం వల్ల బరువు పెరుగుతుందా? నిజమేంటి?

వర్షాకాలంలో గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే వేడివేడిగా ఈ తీయని డ్రింక్ తాగితే వెంటనే ఉపశమనం

దేశంలో పేపర్ లీక్ వ్యతిరేకంగా కొత్త చట్టం.. చైనా, అమెరికా సహా ప్రపంచదేశాల్లో చట్టాలు ఎలాగున్నాయంటే

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తొలిసారి తీసుకుంటున్నారా? ముందు ఈ 4 విషయాలు తప్పక చెక్ చేయండి

ఆఫర్ ధరలో సూపర్ సౌండ్ క్వాలిటీ ఇయర్ బడ్స్.. డోంట్ మిస్

Big Stories

Advertisement
×