E-Paper
Advertisement

ఉదయం లేచినప్పటి నుంచి సిగరెట్ తాగే వ్యసనం.. ఈ చిట్కాతో కొన్ని నిమిషాల్లోనే మానేశాడు

ఉదయం లేచినప్పటి నుంచి సిగరెట్ తాగే వ్యసనం.. ఈ చిట్కాతో కొన్ని నిమిషాల్లోనే మానేశాడు
Advertisement

How To Quit Smoking| ఒక్క సిగరెట్‌తో మొదలైన అలవాటు 26 ఏళ్ల పాటు కొనసాగింది. రోజుకు 15 సిగరెట్లు తాగే స్థాయికి చేరింది. ఎన్నోసార్లు మానేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు ఆ యువకుడు కేవలం కొన్ని నిమిషాల్లోనే చివరి సిగరెట్ తాగి పూర్తిగా పొగతాగడం మానేశాడు. అసలు ఇది ఎలా సాధ్యమైంది?

ఒక్క పఫ్‌తో మొదలైన అలవాటు రోజుకు 15 సిగరెట్లకు చేరింది

యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సమయంలో స్నేహితుల ఛాలెంజ్ చేయడంతో ఆ యువకుడు మొదటిసారి సిగరెట్ తాగారు. మొదట అది సరదాగా మొదలైన ప్రయోగమే. అయితే చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగాల కోసం నగరాలు మారినా సిగరెట్ అలవాటు మాత్రం మారలేదు. క్రమంగా సిగరెట్ల సంఖ్య పెరుగుతూ రోజుకు 15 వరకు చేరింది.

జీవితంలోని ప్రతి సందర్భంతో స్మోకింగ్

Advertisement

కొంతకాలానికి సిగరెట్ తాగడం రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచిన వెంటనే సిగరెట్ తాగేవారు. టీ తాగేటప్పుడు, భోజనం తర్వాత, కోపం వచ్చినప్పుడు కూడా సిగరెట్ కావాల్సి వచ్చేది. ఒత్తిడి, బోర్, పని ఎక్కువగా ఉండటం వంటి పరిస్థితులు కూడా సిగరెట్‌కు కారణాలయ్యాయి. ప్రతి గంటకు సిగరెట్ తాగాలనే కోరిక కలిగే స్థాయికి వ్యసనం పెరిగింది.

ఎన్నో ప్రయత్నాలు చేసినా సిగరెట్ మానేయడం సాధ్యం కాలేదు

2006 నుంచి సిగరెట్ మానేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కౌన్సెలర్లను, వైద్యులను కూడా సంప్రదించారు. ఒకసారి ఆరు నెలల పాటు సిగరెట్‌కు దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో సిగరెట్ కోసం ఖర్చు చేయాల్సిన డబ్బుతో రూ.7,500కు ఫ్రిజ్ కూడా కొనుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాత మళ్లీ సిగరెట్ అలవాటు మొదలైంది.

Advertisement

Also Read:  పట్టువదలని విక్రమార్కుడు.. 15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

ఒక్క యాప్‌తో సిగరెట్‌కు దూరం

రెండు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో QuitSure అనే యాప్ గురించి యాడ్స్ పదేపదే కనిపించడంతో దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అందులో వ్యసనం నుంచి బయటపడడానికి 6 వారాల ప్రొగ్రామ్ ఎంచుకున్నాడు. ఈ 42 రోజుల ప్రొగ్రామ్‌లో సిగరెట్ల సంఖ్యను వెంటనే తగ్గించలేదు. బదులుగా, నికోటిన్, క్రేవింగ్స్, రిసెప్టర్లు, మైండ్‌ఫుల్ స్మోకింగ్, స్మోకింగ్‌పై మనసు ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకున్నాడు. వీడియోలు, టెక్స్ట్ ద్వారా సిగరెట్ అలవాటును సైంటిఫిక్‌గా అర్థం చేసుకునేలా కార్యక్రమం సాగింది.

Also Read: మీరు ఇంట్లోనే RO వాటర్ తాగుతున్నారా? అది విషపూరితం కావొచ్చు.. ఈ 3 సంకేతాలు గుర్తించండి

42వ రోజున చివరి సిగరెట్‌కు 6 నిమిషాలు మాత్రమే

42వ రోజు కూడా ఆ యువకుడు అప్పటికే 14 సిగరెట్లు తాగాడు. అప్పుడు యాప్‌లో ఇదే తన చివరి సిగరెట్ అని సందేశం వచ్చింది. ఆ చివరి సిగరెట్‌ను ప్రత్యేక సూచనల ప్రకారం 6 నిమిషాల్లో పూర్తి చేయాల్సి వచ్చింది. ఆయన 6 నిమిషాల్లో చివరి గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ తాగాడు. ఆ తర్వాత పూర్తిగా స్మోకింగ్‌కు దూరమయ్యాడు.

26 ఏళ్లుగా కొనసాగిన అలవాటు చివరకు ఆ 6 నిమిషాలతో ముగిసింది. ఎన్నో ప్రయత్నాలు విఫలమైన తర్వాత, సిగరెట్‌పై తన ఆలోచనా విధానం మారడం ఈ విజయానికి కారణమైందని ఆయన చెబుతున్నారు.

Related News

అవసరం తీరిపోయాక పట్టించుకోరు.. ఈ రాశుల్లో పుట్టినవారు స్వార్థపరులు

పవిత్రమైన తులసి.. గణపతికి మాత్రం పెట్టరు.. ఎందుకో తెలుసా?

పెళ్లి తర్వాత తొలి వినాయక చవితి.. నవదంపతులు తప్పక పాటించాల్సిన 7 అందమైన సంప్రదాయాలు

ఏనుగు తల నుంచి 21 పత్రుల వరకు.. గణపతి గురించి 5 ఆసక్తికర విషయాలు!

వినాయక చవితికి అదిరిపోయే లుక్ కావాలా? లేడీస్ కోసం 5 బెస్ట్ ఎథ్నిక్ అవుట్‌ఫిట్స్

వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదా? పొరపాటున చూస్తే ఏమవుతుంది?

వినాయక చవితి రోజు చేయకూడని పనులు.. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి జోలికి వెళ్లకండి!

Big Stories

Advertisement
×