E-Paper
Advertisement

పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఫేవరెట్.. కేవలం 10 నిమిషాల్లో తయారు చేసే 5 పాస్తా రెసిపీలు

పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఫేవరెట్.. కేవలం 10 నిమిషాల్లో తయారు చేసే 5 పాస్తా రెసిపీలు
Advertisement

Instant Pasta Recipes| సాయంత్రం కాస్త ఆకలిగా అనిపించినప్పుడు ఏం తినాలో ఆలోచిస్తుంటాం. పిల్లల టిఫిన్ కోసం కొత్తగా ఏదైనా చేయాలన్నా సందేహమే. అలాంటి సమయంలో పాస్తా మంచి ఎంపికగా ఉంటుంది. తక్కువ సమయంలో తయారు చేసేయోచ్చు పైగా రుచి కూడా బాగుటుంది. రోజూ ఒకే రకం పాస్తా తిని బోర్ కొడుతోందా? అయితే ఈ ఐదు వెరైటీ పాస్తా రెసిపీలను తప్పకుండా ట్రై చేయండి. సాధారణంగా ఇంట్లో ఉండే కూరగాయలు, మసాలాలు, ఇతర పదార్థాలతో వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు.

1. స్పైసీగా కావాలంటే దేశీ మసాలా పాస్తా

కారం, ఇండియన్ మసాలాల రుచి ఇష్టపడేవారికి ఈ పాస్తా బాగా నచ్చుతుంది. ముందుగా పాస్తా.. నీటిలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి. తర్వాత టమాటా, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేసి బాగా వేయించాలి. ఇందులో కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు కలపాలి. మసాలా బాగా ఉడికిన తర్వాత ఉడికించిన పాస్తా వేసి కలపండి. రెండు నిమిషాలు ఉడికించి కొత్తిమీరతో పైన డెకరేట్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.

2. పిల్లలకు క్రీమీ వైట్ సాస్ పాస్తా

Advertisement

వైట్ సాస్ పాస్తా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే రుచికరమైన రెసిపీ. ఒక పాన్‌లో కొద్దిగా బటర్ కరిగించి ఒక చెంచా మైదా వేయాలి. మైదాను ఒక నిమిషం నెమ్మదిగా వేయించి పచ్చి వాసన పోయేలా చేయాలి. తర్వాత పాలను కొద్దికొద్దిగా పోస్తూ నిరంతరం కలుపుతూ ఉండాలి. సాస్ కాస్త చిక్కగా మారిన తర్వాత ఉప్పు, మిరియాల పొడి కలపాలి.
రుచి కోసం ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించిన పాస్తా, స్వీట్ కార్న్ లేదా క్యాప్సికమ్ కలపండి. చివరగా కొద్దిగా చీజ్ వేసి క్రీమీగా సర్వ్ చేసేండి.

3. పుల్లటి తీపి రుచికి రెడ్ సాస్ పాస్తా

టమాటా రుచి ఇష్టపడేవారికి రెడ్ సాస్ పాస్తా మంచి ఎంపిక. ముందుగా మూడు లేదా నాలుగు టమాటాలను ఉడికించి మెత్తగా పేస్ట్ చేయాలి. పాన్‌లో నూనె లేదా బటర్ వేడి చేసి సన్నగా తరిగిన వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి మంచి వాసన వచ్చిన తర్వాత టమాటా పేస్ట్ కలపండి. ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా టమాటా సాస్ వేయాలి. సాస్ చిక్కగా అయిన తర్వాత ఉడికించిన పాస్తా వేసి బాగా కలపండి. రెండు నిమిషాలు ఉడికిస్తే టేస్టీ రెడ్ సాస్ పాస్తా సిద్ధమవుతుంది.

4. తక్కువ పదార్థాలతో గార్లిక్ బటర్ పాస్తా

Advertisement

ఇంట్లో ఎక్కువ పదార్థాలు లేనప్పుడు గార్లిక్ బటర్ పాస్తా మంచి ఆప్షన్. దీనికి పాస్తా, బటర్, వెల్లుల్లి, కొన్ని సాధారణ మసాలాలు సరిపోతాయి. పాస్తాను ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో రెండు చెంచాల బటర్ కరిగించి సన్నగా తరిగిన వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి లైట్ గోల్డెటన్ కలర్‌లోకి మారే వరకు వేయించాలి. చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో మరియు ఉప్పు వేసి కలపాలి. తర్వాత పాస్తా వేసి బటర్‌తో బాగా కలిసేలా టాస్ చేయాలి.

5. చీజ్ ప్రియుల కోసం చీజీ మకరోనీ

చీజ్ ఇష్టపడేవారికి చీజీ మకరోనీ ఒక అద్భుతమైన ఎంపిక. ముందుగా మకరోనీని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో కొద్దిగా పాలు వేడి చేసి ఉడికించిన మకరోనీ వేయాలి. రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి కలపాలి. ఇప్పుడు ఎక్కువగా తురిమిన చీజ్ వేసి నెమ్మదిగా కలపాలి. చీజ్ పూర్తిగా కరిగే వరకు రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించాలి. క్రీమీ, చీజీ మకరోనీ వెంటనే సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది.

Also Read: పట్టువదలని విక్రమార్కుడు.. 15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్

తక్కువ సమయంలో టేస్టీ పాస్తా

ఈ ఐదు పాస్తా రెసిపీలు బిజీగా ఉన్న రోజులకు చాలా ఉపయోగపడతాయి. సాయంత్రం స్నాక్స్‌గా లేదా పిల్లల టిఫిన్ కోసం వీటిని తయారు చేయవచ్చు. మీ కుటుంబ సభ్యుల రుచికి అనుగుణంగా కూరగాయలు మరియు మసాలాలు మార్చుకోవచ్చు. తక్కువ సమయంలో రుచికరమైన వంటకం కావాలంటే ఈ పాస్తా రెసిపీలను తప్పకుండా ట్రై చేయండి.

Also Read: ఫుడ్ పాయిజనింగ్‌ అంటే కేవలం వాంతులు, విరేచనాలు కాదు.. నరాలు, కిడ్నీలు, కీళ్లకు ప్రమాదం.. ఎలాగంటే

Related News

మధ్యాహ్నం 3 గంటల తర్వాత నీరసంగా అనిపిస్తోందా? రోజంతా ఫుల్ ఎనర్జీ కోసం సింపుల్ టిప్స్

అవసరం తీరిపోయాక పట్టించుకోరు.. ఈ రాశుల్లో పుట్టినవారు స్వార్థపరులు

ఉదయం లేచినప్పటి నుంచి సిగరెట్ తాగే వ్యసనం.. ఈ చిట్కాతో కొన్ని నిమిషాల్లోనే మానేశాడు

పవిత్రమైన తులసి.. గణపతికి మాత్రం పెట్టరు.. ఎందుకో తెలుసా?

పెళ్లి తర్వాత తొలి వినాయక చవితి.. నవదంపతులు తప్పక పాటించాల్సిన 7 అందమైన సంప్రదాయాలు

ఏనుగు తల నుంచి 21 పత్రుల వరకు.. గణపతి గురించి 5 ఆసక్తికర విషయాలు!

వినాయక చవితికి అదిరిపోయే లుక్ కావాలా? లేడీస్ కోసం 5 బెస్ట్ ఎథ్నిక్ అవుట్‌ఫిట్స్

Big Stories

Advertisement
×