Beat Afternoon Sluggishness| మధ్యాహ్న భోజనం పూర్తయింది. ఇంకా కొన్ని గంటల పాటు చేయాల్సిన పని మిగిలి ఉంటుంది. కానీ ఒక్కసారిగా శరీరంలో ఎనర్జీ తగ్గిపోతుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. దృష్టి పెట్టడం కూడా కష్టంగా అనిపిస్తుంది. మరికొందరు వెంటనే మరో కప్పు కాఫీ కోసం వెతుకుతారు. ఇలాంటి సమస్యను చాలా మంది ప్రతిరోజూ ఎదుర్కొంటారు.
ఆయుర్వేద హెల్త్ కోచ్ డింపుల్ జాంగ్డా ప్రకారం.. ఈ అలసట, నీరసానికి కారణం జీర్ణక్రియ కూడా ఒక కారణం కావచ్చు. ఆమె సూచించిన కొన్ని సులభమైన అలవాట్లు రోజంతా ఎనర్జీగా ఉండటానికి సహాయపడవచ్చు.
మన శరీరానికి ఆహారం తినడం ద్వారా మాత్రమే ఎనర్జీ అందదు. ఆహారం సరిగ్గా జీర్ణమై పోషకాలు శరీరానికి అందాలి. డింపుల్ జాంగ్డా ప్రకారం.. పోషకాలు సరిగా శోషించబడకపోతే నీరసం రావచ్చు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంలో ఓజస్ అంటే శక్తి, బలం, ఆరోగ్యంతో సంబంధం ఉన్న భావన. సరైన జీర్ణక్రియ శరీరానికి పోషకాలను అందించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద చెబుతోంది. అందుకే ఆహారంతో పాటు జీర్ణక్రియపై కూడా శ్రద్ధ పెట్టడం మంచిది.
డింపుల్ జాంగ్డా ఖర్జూరం, నెయ్యి కలయిక శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తుంది. ఒక ఖర్జూరంతో పాటు ఒక టీస్పూన్ నెయ్యి తీసుకోవచ్చని ఆమె చెబుతున్నారు. ఖర్జూరంలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి త్వరగా ఎనర్జీ అందించడంలో సహాయపడతాయి. నెయ్యిలో ఉండే కొవ్వులు ఈ ఆహారాన్ని మరింత తృప్తికరంగా మారుస్తాయి. ఈ కలయిక ఎక్కువసేపు ఎనర్జీగా ఉండటానికి ఉపయోగపడవచ్చని డింపుల్ జాంగ్డా తెలిపారు. అయితే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.
కుంకుమపువ్వు.. ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. నిపుణురాలు ఒకటి లేదా రెండు కుంకుమపువ్వు రేకులను రాత్రంతా నీటిలో నానబెట్టాలని సూచిస్తున్నారు. మరుసటి రోజు వాటిని మీకు నచ్చిన పాలలో కలుపుకోవచ్చు. దీన్ని ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు తీసుకోవచ్చని ఆమె చెబుతున్నారు. కుమపువ్వు మంచి మూడ్‌కు సహాయపడుతుంది. మంచి మూడ్ ఉండటం వల్ల రోజువారీ పనుల్లో మరింత ఉత్సాహంగా ఉండవచ్చు.
నిద్రకు ముందు బరువైన ఆహారం తీసుకోవడం నిద్రకు ఇబ్బంది కలిగించవచ్చు. మీరు నిద్రపోతున్న సమయంలో కూడా శరీరం ఆహారాన్ని జీర్ణం చేస్తూనే ఉంటుంది. దీని వల్ల శరీరానికి సరైన విశ్రాంతి లభించకపోవచ్చు. నిద్ర సరిగా లేకపోతే మరుసటి రోజు ఉదయం నుంచే అలసటగా అనిపిస్తుంది. ఈ అలసట మధ్యాహ్నం సమయానికి మరింత పెరగవచ్చు. అందుకే నిద్రకు కనీసం మూడు నుంచి నాలుగు గంటల ముందే చివరి భోజనం చేయాలని సూచిస్తున్నారు. తేలికైన, సమతుల్యమైన రాత్రి భోజనం ఎంచుకోవడం కూడా మంచిది.
Also Read: ట్రావెల్ చేసేటప్పుడు ఇల్లు గుర్తుకొస్తోందా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
మధ్యాహ్నం అలసట మీ పని, ఏకాగ్రత, మూడ్‌పై ప్రభావం చూపిస్తాయి. ఆహారం, జీర్ణక్రియ, నిద్రపై శ్రద్ధ పెట్టడం ఉపయోగకరం. ఎనర్జీ తగ్గిన ప్రతిసారీ కేవలం కాఫీపైనే ఆధారపడకండి. రోజంతా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడానికి ప్రయత్నించండి. అయితే తరచుగా అలసట వేధిస్తే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
గమనిక: ఈ సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఇది వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. తరచుగా అలసట లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే నిపుణుల సలహా తీసుకోండి.
Also Read: వయసు పెరిగినా శరీరంలో చరుకుదనం తగ్గదు.. డాక్టర్ సూచించిన ఈ 6 అలవాట్లు పాటిస్తే