E-Paper
Advertisement

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్
Advertisement

Sci-Fi Action Movie: ఏలియన్లు గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది.  మన మధ్యే వేలాది ఏలియన్లు రహస్యంగా జీవిస్తూ ఉంటాయి. వీటికి ఒక సీక్రెట్ ఏజెంట్ కూడా ఉంటాడు. క్షణ క్షణం ఊహించని మలుపులతో ఈ మూవీ యాక్షన్, కామెడీ, సైన్స్ ఫిక్షన్, హైటెక్ గ్యాడ్జెట్స్ తో సాగుతుంది. ఇలాంటి కథతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ‘ఎమ్‌ఐబీ: ఇంటర్నేషనల్’ (MIB: International).

కథలోకి వెళ్తే…

సాధారణ ప్రజలకు తెలియని ఒక రహస్య ప్రపంచం భూమిపై నడుస్తుంటుంది. మనుషుల మధ్యే వేలాది ఏలియన్లు జీవిస్తుంటారు. వాళ్ల ఉనికిని రహస్యంగా ఉంచుతూ, వారి కదలికలను పర్యవేక్షించే సంస్థే *మెన్ ఇన్ బ్లాక్ (Men in Black)*. ఈ సంస్థలో అత్యాధునిక టెక్నాలజీ, ప్రత్యేకమైన గ్యాడ్జెట్స్, సీక్రెట్ మిషన్లు ఉంటాయి.

Advertisement

ఈ ప్రపంచంలోకి ఏజెంట్ M అడుగుపెడుతుంది. చిన్నతనంలోనే ఒక ఏలియన్‌ను చూసిన ఆమెకు అప్పటి నుంచే MIBలో చేరాలనే కోరిక ఉంటుంది. చివరకు ఆ కల నెరవేరి లండన్ బ్రాంచ్‌లో పనిచేసే అవకాశం వస్తుంది. అక్కడ ఆమెకు ఏజెంట్ H తో కలిసి పనిచేయాల్సి వస్తుంది.

ఏజెంట్ H తెలివైనవాడే అయినా కొంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటాడు. ఇద్దరి స్వభావాలు వేర్వేరుగా ఉండటంతో మొదట వారి భాగస్వామ్యం ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారుతుంది. కానీ వారికి అప్పగించిన మిషన్ మాత్రం సరదాగా తీసుకునే విషయం కాదు.

Advertisement

ఒక కీలకమైన ఏలియన్ రాయబారిని రక్షించే బాధ్యత M, Hలకు అప్పగించబడుతుంది. ఆ రాయబారి భద్రత MIBకు అత్యంత ముఖ్యమైనది. కానీ మిషన్ అనుకున్నట్టుగా సాగదు. అత్యంత శక్తివంతమైన పరగ్రహ శత్రువులు రాయబారిపై దాడి చేసి అతడిని చంపేస్తారు. అంతేకాదు, విశ్వాన్ని నాశనం చేసే స్థాయిలో ప్రమాదకరమైన ఆయుధాన్ని కూడా దొంగిలిస్తారు.

ఇప్పుడు M, H ముందున్న సమస్య మరింత పెద్దదవుతుంది. ఆయుధం శత్రువుల చేతిలో ఉంటే దాని ప్రభావం ఎంత దూరం వెళ్తుందో ఊహించడం కూడా కష్టం. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. కానీ ఆ ప్రయత్నంలో మరో షాకింగ్ విషయం బయటపడుతుంది.

MIB సంస్థలోనే ఒక కోవర్ట్ ద్రోహి ఉన్నాడని వారికి తెలుస్తుంది. అతడు ఏలియన్లతో చేతులు కలిపి పనిచేస్తున్నాడు. అంటే శత్రువులు బయట మాత్రమే లేరు. సంస్థలోని రహస్య సమాచారం కూడా శత్రువులకు చేరుతోంది. దీంతో ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో కూడా M, Hలకు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.

అయినా ఇద్దరూ కలిసి ఆయుధాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో హైటెక్ గ్యాడ్జెట్స్, ఏలియన్ టెక్నాలజీ, యాక్షన్ సన్నివేశాలు కథకు వేగాన్ని తీసుకొస్తాయి. చివరికి ద్రోహి ఎవరు? ఆయుధం ఎక్కడికి చేరింది? M, H కలిసి భూమిని, విశ్వాన్ని ఎలా కాపాడారు? అన్నదే కథలో అసలు ఆసక్తి.

 తెలుగులో అందుబాటులో ఉందా?

‘ఎమ్‌ఐబీ: ఇంటర్నేషనల్’ (MIB: International) జూన్ 14, 2019న విడుదలైంది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (Hotstar)లో తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఏలియన్స్, సీక్రెట్ ఏజెంట్లు, సైన్స్ ఫిక్షన్ యాక్షన్, హైటెక్ గ్యాడ్జెట్స్ నచ్చేవారికి ఇది మంచి ఎంటర్‌టైనర్.

Read Also: అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

ఇరుముడి నుంచి లస్ట్ ​స్టోరీస్ వరకు… ఈ వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన 7 క్రేజీ ప్రాజెక్ట్‌లు

Big Stories

Advertisement
×