E-Paper
Advertisement

బంగారు మోదక్స్‌కు భారీ డిమాండ్.. కిలో రూ.27000.. మీకూ కావాలా?

బంగారు మోదక్స్‌కు భారీ డిమాండ్.. కిలో రూ.27000.. మీకూ కావాలా?
Advertisement

Ganesh Chaturthi Golden Modaks| వినాయక చవితి వచ్చిందంటే ఇళ్లలో పూజలు, వీధుల్లో భారీ మండపాలు, రంగురంగుల అలంకరణలు కనిపిస్తాయి. ఈ పండుగలో రకరకాల స్వీట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పండుగ స్పెషల్ స్వీట్ గణపయ్యకు ఇష్టమైన మోదక్. లడ్డూలు, మోదక్‌లు వంటి నైవేద్యాలతో భక్తులు ఆ శ్రీ గణేశుడిని పూజిస్తారు. అయితే, నాశిక్‌లోని ఓ స్వీట్ షాప్ ఇప్పుడు తయారు చేసిన మోదక్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానికి కారణం అక్కడ లభించే స్పెషల్ మోదక్స్. ప్రతీ సంవత్సరం ఈ షాపులో బంగారు మోదక్స్ తయారు చేస్తారు. అయితే ఈ సారి వాటి ధర చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు.

గోల్డెన్ మోదక్ ధర కిలో రూ.27,000

నాశిక్‌లోని విద్యా వికాస్ సర్కిల్ వద్ద సాగర్ స్వీట్స్ ఉంది. ఈ ఏడాది గణేశోత్సవం సందర్భంగా ఆ షాప్‌లో గోల్డెన్ మోదక్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ మోదక్‌పై తినదగిన బంగారు పూతను ఉపయోగించారు. దీంతో మోదక్ ఎంతో ఆకర్షణీయంగా, లగ్జరీ ఫుడ్ ఐటెమ్‌గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఖరీదైన మోదక్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ సారి కిలో గోల్డెన్ మోదక్ ధర ఏకంగా రూ.27,000గా ఉంది. సాధారణ మోదక్‌లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ ధర.

2021లో ధర ఎంత ఉందంటే?

Advertisement

సాగర్ స్వీట్స్ గతంలో కూడా గోల్డెన్ మోదక్‌‌లను విక్రయించింది. 2021లో కిలో గోల్డెన్ మోదక్ ధర రూ.12,000గా ఉండేది. గత ఏడాది ఇదే మోదక్‌ను రూ.20,000కు విక్రయించారు. అయితే, ఈ ఏడాది ధర రూ.27,000కు చేరింది. అంటే 2021తో పోలిస్తే ప్రస్తుతం గోల్డెన్ మోదక్ ధర రెట్టింపు కంటే ఎక్కువైంది. గతంలో ఈ స్వీట్ షాప్ సిల్వర్ మోదక్‌ను కూడా తయారు చేసినట్లు సమాచారం.
దానిపై తినదగిన వెండి పూతను ఉపయోగిస్తారు.

Also Read: వయసు పెరిగినా శరీరంలో చరుకుదనం తగ్గదు.. డాక్టర్ సూచించిన ఈ 6 అలవాట్లు పాటిస్తే

ఉకడిచే మోదక్‌కు ప్రత్యేక గుర్తింపు

Advertisement

గణేశోత్సవం సమయంలో మార్కెట్లలో అనేక రకాల మోదక్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే సంప్రదాయ ఉకడిచే మోదక్‌కు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఉకడిచే మోదక్‌ను సాధారణంగా బియ్యప్పిండి పిండితో తయారు చేస్తారు. లోపల కొబ్బరి, బెల్లంతో తయారు చేసిన తీపి పూర్ణాన్ని ఫిల్లింగ్ చేస్తారు. యాలకులు, జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలు దాని రుచిని మరింత పెంచుతాయి.
పిండిని చిన్న గిన్నెలా చేసి, అందులో పూర్ణాన్ని నింపుతారు. తర్వాత అంచులను చేతితో మడిచి మోదక్‌కు ప్రత్యేక ఆకారాన్ని ఇస్తారు. చివరగా వాటిని ఆవిరిపై ఉడికిస్తారు.

సంప్రదాయ మోదక్‌కు గోల్డెన్ టచ్

గోల్డెన్ మోదక్ సంప్రదాయ స్వీట్‌కు విలాసవంతమైన రూపాన్ని తీసుకొచ్చింది. దానిపై ఉన్న బంగారు పూత ఈ మోదక్‌ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. అయితే రూ.27,000 ధర కారణంగా ఇది అందరికీ అందుబాటులో ఉండే స్వీట్ కాదు. చాలామంది మాత్రం పండుగలో ఇంట్లో తయారు చేసే సంప్రదాయ మోదక్‌నే ఇష్టపడతారు.

మరి మీకూ గోల్డెన్ మోదక్ కావాలంటే నాశిక్ స్వీట్ షాపులో మాత్రమే లభిస్తున్నాయి. అక్కడికి వెళ్లాల్సిందే.

Also Read: మీరు ఇంట్లోనే RO వాటర్ తాగుతున్నారా? అది విషపూరితం కావొచ్చు.. ఈ 3 సంకేతాలు గుర్తించండి

Related News

చలికాలంలో దాహం తక్కువగా ఉంటుంది.. శరీరంలో నీరు తగ్గితే వచ్చే సమస్యలివే

క్యాప్సికమ్‌లో మటన్ ఖీమా స్టఫింగ్.. ఈ వెరైటీ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా?

ఈవెనింగ్ స్నాక్ కోసం ఈ చికెన్ పెరి పెరి పాపర్స్ ట్రై చేయండి.. ఇంటిల్లిపాదీ శభాష్ అంటారు!

స్వీట్ షాప్ టేస్ట్ గ్యారెంటీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోదగ్గ నెల్లూరు మలైకాజా రెసిపీ!

మీ పర్సు రంగు ఇదేనా? వాస్తు ప్రకారం డబ్బు నిలవాలంటే ఈ రంగులే బెస్ట్!

డేటింగ్ యాప్స్‌లో చాట్‌ఫిషింగ్ కలకలం.. రొమాంటిక్ మెసేజ్‌లతో మాయాజాలం

పాలు,పంచదార ఉంటే చాలు..ఇంట్లోనే దూది లాంటి రసగుల్లా రెడీ!

ఎప్పుడూ చేసుకునే దొండకాయ ఫ్రై బోర్ కొట్టిందా?ఈసారి ఇలా ట్రై చేయండి

Big Stories

Advertisement
×