E-Paper
Advertisement

వరుణ్ తేజ్ మంచి మనసు.. ట్యూమర్ చికిత్సకి అయ్యే పూర్తి ఖర్చు తనదే అంటూ!

వరుణ్ తేజ్ మంచి మనసు.. ట్యూమర్ చికిత్సకి అయ్యే పూర్తి ఖర్చు తనదే అంటూ!
Advertisement

Varun Tej:ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలలో కూడా సేవా దృక్పథం ఎక్కువవుతోందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది అంటే ఇండస్ట్రీ పెద్దలు ముందుండేవాళ్ళు. అయితే ఇప్పుడు తాము కూడా ఒక చేయి కలుపుదాం అంటూ తమ వంతుగా అండగా నిలుస్తూ ఆర్థికంగా భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరికైనా కష్టం వచ్చింది అంటే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), ఆయన తమ్ముళ్లు నాగబాబు(Naga Babu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సహాయం చేయడంలోఎలా అయితే ముందుంటారో.. ఇప్పుడు వారి వారసులు కూడా రంగంలోకి దిగారు.

గొప్ప మనసు చాటుకున్న వరుణ్ తేజ్..

ముఖ్యంగా మెగా వారసుడు ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తన అభిమానికి అండగా నిలవడమే కాకుండా తన తండ్రుల బాటలో నడుస్తూ ఎంతోమంది యువ హీరోలకి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ప్రిన్స్ వరుణ్ తేజ్ అభిమానుల కష్టసుఖాల్లో అండగా నిలిచే మెగా కుటుంబ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న ఒక అభిమానికి మెరుగైన వైద్యం అందించడానికి ముందుకు వచ్చారు.. విషయంలోకి వెళ్తే.. అనంతపురం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, గుత్తి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు సురేష్ పాటిల్ (Suresh Patil) ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారని తెలుసుకున్న వరుణ్ తేజ్.. ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించేలా అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు.

తల్లి సహకారంతో అభిమానికి శస్త్ర చికిత్స..

Advertisement

తన తల్లి పద్మజా కొణిదెల (Padmaja konidela) సహకారంతో హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులను సంప్రదించిన వరుణ్ తేజ్.. సురేష్ పాటిల్ కి మెరుగైన చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అంతేకాదు శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోపాటు హాస్పిటల్లో ఆయన వైద్యానికి, ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు, చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని స్వయంగా చెప్పినట్లు వరుణ్ తేజ్ సన్నిహితులు తెలిపారు. అలాగే సురేష్ పాటిల్ పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయ్యేవరకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు వరుణ్ తేజ్ గొప్ప మనసును కొనియాడుతూ.. సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

also read: ఓటీటీలోకి 4 కొత్త సినిమాలు.. ఆ 2 మాత్రం మిస్ అవ్వద్దు!

సహాయంలో తండ్రుల బాటలో వరుణ్ తేజ్..

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు.. ఈయన ఇటీవల మరొక అభిమానికి సహాయం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. అనంతపురానికి చెందిన ఒక అభిమాని మృతి చెందిన సమయంలో కూడా ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల నుంచి స్పూర్తి పొందిన వరుణ్ తేజ్ కూడా సమాజసేవలో తన వంతు సహాయం చేస్తూ అవసరంలో ఉన్నవారికి చేయూతనిస్తూ అభిమానుల మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. వరుణ్ తేజ్ విషయానికొస్తే ప్రస్తుతం ఈయన ‘కొరియన్ కనకరాజు’ సినిమాలో నటించారు. ఆగస్టు ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.

Related News

Srinivas Mangapuram Twitter Review : ‘శ్రీనివాస మంగాపురం ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

నాతో మీకు ప్రాబ్లమ్ ఏంటి..? కిరణ్ అబ్బవరం ఎదగకూడదా..?

Ramayana Trailer Review : విజువల్ వండర్ గా ‘రామాయణ’ ట్రైలర్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజువల్స్..

ఈ హీరోయిన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూస్తే కళ్లు తిరిగిపోతాయి..!

ఏఐ వస్తే నాయకుల ఆట క్లోజ్ అంటున్న ఆర్జీవీ!

భాగవతం కథతో పాన్ ఇండియా ప్లాన్.. ఏకంగా 7 సినిమాలు!

షూటింగ్‌కు బ్రేక్.. పిల్లలతో స్పైడర్‌మ్యాన్ చూసిన బన్నీ!

Big Stories

Advertisement
×