E-Paper
Advertisement

Healthy Drink: రోజూ నిమ్మరసం, మెంతుల నీరు తాగారంటే ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు

Healthy Drink: రోజూ నిమ్మరసం, మెంతుల నీరు తాగారంటే ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు
Advertisement

ఉదయం ఖాళీ పొట్టతో కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. వాటిలో నిమ్మకాయ రసం,మెంతులు నానబెట్టిన నీరు కూడా ముఖ్యమైనవి. ఈ రెండు పదార్థాలు పోషకాలతో నిండి ఉంటాయి. ప్రతిరోజూ ఈ పానీయం తీసుకుంటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్, కొన్ని ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఈ రెండు కలిసి తీసుకుంటే శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ పానీయం తాగితే జీర్ణక్రియ కూడా మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గించే డ్రింక్
ఈ పానీయం బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కూడా కొంత సహాయపడవచ్చు. మెంతుల్లో ఉండే ఫైబర్ వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో అనవసరంగా ఏదో ఒకటి తినడం తగ్గుతుంది. అదే సమయంలో నిమ్మరసం శరీరంలోని మెటాబాలిజాన్ని కొంత పెంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు తగ్గడంలో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ పానీయం అద్భుతంగా పనిచేస్తుంది కొంతమందికి తరచుగా అజీర్ణం, గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తుంటాయి. మెంతుల్లో ఉండే సహజ పదార్థాలు పొట్టను శాంతింపజేస్తాయి. అలాగే నిమ్మరసం జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌లను చురుకుగా చేస్తుంది. దీంతో ఆహారం సులభంగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది.

Advertisement

Also read: Orange Jelly: కేవలం 3 పదార్థాలతో ఇంట్లోనే టేస్టీ ఆరెంజ్ జెల్లీ చేసేయండి, రెసిపీ ఇదిగో

ఈ పానీయం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంటాయి. మెంతుల్లో ఉండే ఫైబర్ శరీరంలో చక్కెర శోషణను నెమ్మదిగా చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా ఉండవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఈ పానీయం తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చర్మ ఆరోగ్యానికి కూడా ఈ పానీయం ఉపయోగకరంగా ఉండవచ్చు. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే మెంతుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడడంలో సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం కొంత మెరుపుగా కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement

Also read: Rajma Pulao: రాజ్మా పులావ్.. తింటే రుచే కాదు, పోషకాహారలోపం కూడా రాదు, రెసిపీ ఇదిగో

ఎలా తయారుచేయాలి?
ఈ పానీయం తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడగట్టి అందులో అర నిమ్మకాయ రసం పిండాలి. కావాలంటే కొద్దిగా తేనె కలిపి తాగవచ్చు. ఈ పానీయం ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరికీ ఇది ఒకే విధంగా పనిచేయకపోవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు తరచుగా ఈ పానీయం తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు.

నిమ్మరసం, మెంతులు కలిపి పానీయంగా తీసుకోవడం వల్ల ఇది ఉత్తమ ఆరోగ్య పానీయంగా మారింది. దీన్నిమితంగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడడం, బరువు నియంత్రణ, చర్మ ఆరోగ్యం వంటి కొన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×