E-Paper
Advertisement

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!
Advertisement

HBD Sitaraఘట్టమనేని వారసురాలిగా మంచి పేరు సొంతం చేసుకున్న దివంగత నటులు సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా అందరి దృష్టిని ఆకర్షించింది సితార. నిజానికి ఈమె సినిమా ఇండస్ట్రీలోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈమె తల్లి నమ్రత శిరోద్కర్ సితార చిన్నప్పటి నుంచే ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వచ్చారు. అలా మహేష్ బాబు కూతురుగా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది సితార . ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే.. మరొకవైపు తన తండ్రి మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాలో పెన్నీ సాంగులో అలరించింది. ఈ పాట తర్వాత సితార మళ్ళీ తెరపై ఎప్పుడూ కనిపించలేదు. కానీ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఈమె.. ఈ జ్యూవెలరీ లో భాగంగా.. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ పై దర్శనమిచ్చి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని అందుకుంది సితార.

సితార బర్తడే స్పెషల్.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్..

ఇకపోతే సితార పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే తన కూతురికి స్పెషల్ విషెస్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు మహేష్ బాబు. “నీకు ఎంత వయసు వచ్చినా సరే ఎప్పటికీ నువ్వు నా చిన్ని తారవే. 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు సితార. రాబోయే సంవత్సరం అత్యంత అద్భుతంగా ఉండాలి. ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ కూతురిని ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫోటోతో పాటు స్పెషల్ విషెస్ తెలియజేశారు.

Advertisement

సితార గొప్ప మనసు.. చారిటబుల్ ట్రస్ట్ కి మొదటి రెమ్యూనరేషన్..

ఇక ఈ నేపథ్యంలోనే ఆమె సమాజానికి చేసిన మంచి సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలా 2023లో PMJ జ్యూవెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సితార వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇందులో పనిచేసినందుకు గానూ తనకు వచ్చిన రెమ్యూనరేషన్ ను ఆమె తీసుకోకుండా ఒక చారిటబుల్ ట్రస్ట్ కి ఇచ్చి మంచి మనసు చాటుకుంది. ముఖ్యంగా ఈ విషయాన్ని పీఎంజే జ్యువెలర్స్ అధినేతలు స్పష్టం చేశారు..

Advertisement

also read:టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

అనాధ బాలికలకు సైకిల్స్ బహుమతిగా..

మరోవైపు సితార ఎప్పటికప్పుడు తన తాత కృష్ణ, తండ్రి మహేష్ బాబు లాగే అందరికీ అండగా నిలుస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే 2024లో తన 12వ పుట్టినరోజు సందర్భంగా.. అనాధ బాలికలతో బర్తడే జరుపుకున్న ఈమె.. వారందరికీ సైకిళ్లను ను బహుమతిగా ఇచ్చింది.

మరో అమ్మాయికి అండగా..

అంతేకాదు నవ్య అనే ఒక పేద అమ్మాయి నీట్ లో మంచి ర్యాంక్ సంపాదించింది. డాక్టర్ కావాలనే తపన ఉన్నప్పటికీ సరైన ఆర్థిక ప్రోత్సాహం లేక వెనుకబడిపోయింది. అయితే ఈ విషయం సితార వరకు వెళ్లడంతో.. మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ ద్వారా సహాయం చేసింది సితార. మెడికల్ పూర్తయ్యే వరకు కాలేజ్, హాస్టల్ ఫీజులన్నీ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ భరిస్తుందని హామీ ఇచ్చింది. అంతేకాదు రూ.1లక్ష 25 వేల క్యాష్ తో పాటు ఒక ల్యాప్ టాప్, స్టెతస్కోప్ కూడా ఆమె బహుమతిగా అందించింది.

సితార ఇంస్టాగ్రామ్ సంపాదన..

ఇకపోతే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సితార.. సోషల్ మీడియా ద్వారా ఏకంగా 2.1 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉంది. యూట్యూబ్ ఛానల్ లో కూడా సుమారుగా 3.49 లక్షల మంది వరకు సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంస్టాగ్రామ్ లో సుమారుగా నెలకు రూ.30 నుండి రూ.40 లక్షల వరకు సంపాదిస్తోంది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ సంపాదన అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×