E-Paper
Advertisement

Laya: చూడడానికి సాఫ్ట్‌గా కనిపిస్తాను కానీ, నన్ను కదిలించారో మరో కోణం చూస్తారు

Laya: చూడడానికి సాఫ్ట్‌గా కనిపిస్తాను కానీ, నన్ను కదిలించారో మరో కోణం చూస్తారు
Advertisement

Laya: ‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీతో కలిసి లయ (Actress Laya) నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampraadayini Suppini Suddhapusani). ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఈటీవీ విన్‌ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ (Sivaji) స్వయంగా నిర్మించగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాల గురించి హీరోయిన్ లయ మాట్లాడుతూ..

Also Read- Heroines: అసభ్యకర రీతిలో, జూమ్ చేసి మరీ మా శరీరాలను చూపించాల్సిన అవసరమేంటి?

నేనే ఏడిపిస్తా

Advertisement

‘‘దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌ స్టోరీ ఎంత బాగా రాసుకున్నాడో.. అంతే క్లారిటీగా తెరకెక్కించాడు. నిజంగా చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. సినిమాను హిలేరియస్‌గా తెరకెక్కించాడు. తనకు ఎలా కావాలో అలాంటి నటనను నటీనటుల నుంచి తీసుకున్నాడు. కాంప్రమైజ్‌ అవ్వని దర్శకుడు. అతనికి ఏం కావాలో అది బాగా తెలుసు. మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ సినిమాలో ఇంత వరకు నేను చేయని పాత్రని, నాకు నేనే కొత్తగా అనిపించే పాత్రని చేశాను. ఇప్పటి వరకు లయ అంటే ఏడిపించడం, ఏడవటం అనే గుర్తింపే ఉంది. కానీ ఈ సినిమాలో నేనే ఏడిపిస్తాను. ఈ పాత్ర చేసే సమయంలో చాలా ఎంజాయ్ చేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థంగా, తన భర్త, ఫ్యామిలీ గురించి ఆలోచించే స్వార్థపరురాలి పాత్ర. నా భర్త, నా ఫ్యామిలీ బాగుండాలని కోరుకునే మనస్తత్వం ఉన్న పాత్ర చేశాను. అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను.

Also Read- Allu Sirish Nainika wedding: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ .. కనిపించని ముగ్గురు స్టార్స్… ఏం జరిగిందబ్బా?

ఎలాంటి పాత్రలు చేయాలని ఉందంటే?

Advertisement

లీడ్‌ రోల్‌ ఎప్పుటూ పర్మినెంట్ కాదు. లీడ్‌ రోల్స్‌ వస్తే తప్పకుండా చేస్తాను. అలాగే.. కథ, నా పాత్ర నచ్చితే చిన్నపాత్రలైనా చేస్తాను. అమ్మాయిల పాత్రలకు పరిధి తక్కువ. వచ్చే పాత్రల్లో బెస్ట్‌ పాత్రలను చేస్తాను. సాఫ్ట్‌ రోల్స్‌ ఆల్రెడీ చేశాను. కాబట్టి స్ట్రాంగ్‌ క్యారెకర్స్‌ చేయాలని కోరుకుంటున్నాను. నేను బేసికల్‌గా చూడటానికి సాప్ట్‌గా ఉన్నా.. నేను చేసే పనులన్నీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ‘వదల’ మూవీలో నాలో మరో కోణాన్ని అంతా చూస్తారు. ‘వదల’ అనే సినిమాలో జగపతిబాబు భార్యగా చేస్తున్నాను. అలాగే శ్రీకాంత్‌తో కూడా మరో సినిమా చేస్తున్నాను. నాగేశ్వరరెడ్డి దర్వకుడు. ‘యమలీల’ తరహాలో సోషియో ఫాంటసీ సినిమా. ‘వదల’ అనేది సైకలాజికల్‌ థ్రిల్లర్‌. ఇలా డిఫరెంట్‌ జోనర్స్‌లో ప్రయత్నిస్తున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Manoj and Mounika: మూడేళ్ల వివాహ బంధం.. నెక్ట్స్ స్టెప్ ఇదేనా?

Related News

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

Big Stories

Advertisement
×