E-Paper
Advertisement

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?
Advertisement

Congress Ganesh: తెలంగాణలో 1000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ఓ ప్రత్యేక వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో యమ చక్కర్లు కొడుతుంది. దీంతో రాష్ట్రంలోనే ఇది ఓ వినూత్నమైన వినాయక విగ్రహం అంటూ సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేలా ‘1,000 రోజుల కాంగ్రెస్ పాలన’ అనే థీమ్‌తో తెలంగాణ మత్స్యకార సహకార సంఘాల ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి‌కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక వినాయక విగ్రహాన్ని తయారు చేసినట్టు పేర్కోన్నారు.

సీఎం మోస్తునట్టుగా..

దీంతొ పాటుగా వినాయక మండపం సైతం విగ్రహనికి తగ్గట్టుగా డిజైన్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన భుజాలపై వినాయక విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో మోస్తున్నట్లుగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. సీఎం రేవంత్ం రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందనే భావనను ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని డిజైన్ చేసినట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి రాష్టంలో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రూ. 2 లక్షల రైతు రుణాలు మాఫీ వంటి కీలక పథకాల వివరాలతో కూడిన వినాయక మండపం వద్ద, డిజిటల్ బోర్డులు, ఫ్లెక్సీలతో అందరికి అర్థమయ్యే రీతిలో డిజైన్ చేశారు.

Advertisement

Also read: ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇండ్ల పత్రాల జారీకి డేట్ ఫిక్స్!

సోషల్ మీడియాలో చక్కర్లు..

రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు, మౌలిక వసతుల కల్పన వంటి ప్రగతి వివరాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వినాయక మండపంలో అమర్చారు. వినాయకుడి వద్ద తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా ఈ వినూత్న అలంకరణ చేయడంతో అక్కడి స్థానికులు, భక్తులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే కాంగ్రెస్ నాయకులు ఈ వీడియోలను లైక్ చేస్తూ, షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను సైతం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also read: త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

Tags

Related News

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్ హవా.. పదవి లేకపోయినా ఆయనే సుప్రీం!

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. గాంధీభవన్‌ పూజలో మాణిక్‌రావు ఠాక్రే ప్రత్యక్షం, మార్పు ఖాయమా?

దళితుల ఓట్ల కోసమే BRS వాడకం.. శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే: పీసీసీ చీఫ్

శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు!

Big Stories

Advertisement
×