E-Paper
Advertisement

Flipkart Layoffs: మళ్లీ మొదలైన లేఆఫ్ లు.. ఫ్లిప్ కార్డులో 300 మందికి పింక్ స్లిప్ లు

Flipkart Layoffs: మళ్లీ మొదలైన లేఆఫ్ లు.. ఫ్లిప్ కార్డులో 300 మందికి పింక్ స్లిప్ లు
Advertisement

Flipkart Layoffs: ఉద్యోగులు మార్చి పేరు చెబితే హడలిపోతున్నారు. గతంలో మార్చి అంటే జీతాలు పెంపు ఉండేది. కానీ ప్రస్తుతం లేఆఫ్ లు నెలగా మారింది. తాజాగా వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లేఆఫ్ లు ప్రకటించింది. సుమారు 250-300 మంది ఉద్యోగులను ఫింక్ స్లిప్లులు ఇస్తుందని తెలుస్తోంది. ఉద్యోగుల వార్షిక పనితీరు ఆధారంగా ఉద్యోగాల్లో కోత పెట్టినట్లు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 3-4% మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఇది కంపెనీ సాధారణంగా ప్రతి ఏడాది విధించే ఉద్యోగుల కోతలు 1-2% కంటే ఎక్కువ.

సీనియర్ల నియామకం

ఫ్లిప్‌కార్ట్ క్రమం తప్పకుండా ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా తక్కువ ఫలితాలు చూపిన ఉద్యోగులను తమ పనితీరు ఆధారంగా తొలగిస్తుంది. ANI నివేదిక ప్రకారం, వివిధ విభాగాలు, ఉద్యోగ స్థాయిల్లో కోతలు విధించింది. అయితే ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగాల నియామాకాలు చేపట్టింది. ఫ్లిప్‌కార్ట్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కంటే ముందే సీనియర్ స్థాయి ఉద్యోగులను నియమిస్తుందని సమాచారం.

సింగపూర్ నుంచి భారత్ కు

Advertisement

డిసెంబర్ 2025లో, ఫ్లిప్‌కార్ట్ తన ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్ కు మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి ఆమోదం పొందింది. ఇది కంపెనీ దేశీయ లిస్టింగ్ కోసం ప్రణాళికలు వేస్తుందని స్పష్టం చేస్తుంది. ఈ చర్యల్లో భాగంగా ఫ్యాషన్, హెల్త్, లాజిస్టిక్స్ లో తమ వ్యాపారాలను విస్తరించాలని నిర్ణయించింది. భారతీయలో తమ సంస్థ నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఎనిమిది సింగపూర్ సంస్థలను ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం చేసింది. ఫ్లిప్‌కార్ట్ గత నెలలో వరసుగా కీలక పదవులను భర్తీ చేసింది.

Also Read:  షాకింగ్.. 4000 మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌.. ట్విట్టర్‌ కో-ఫౌండర్ కీలక ప్రకటన

పెరిగిన ఆదాయం

Advertisement

ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక పరిస్థితి చూస్తే.. టోఫ్లర్ డేటా ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం రూ. 4,248.3 కోట్లతో పోలిస్తే, 2025లో రూ. 5,189 కోట్లకు కంపెనీ ఆదాయం పెరిగింది. కంపెనీ కార్యకలాపాల నుండి ఏకీకృత ఆదాయంలో 17.3% పెరుగుదలతో రూ. 82,787.3 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.70,541.9 కోట్లగా నమోదైంది. ఫ్లిప్ కార్డు గ్రూపులో ఫ్లిప్ కార్డు, మింత్రా, ఫ్లిప్ కార్డు హోల్ సేల్, క్లియర్ ట్రిప్, సూపర్.మనీ కంపెనీలు ఉన్నాయి.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×