E-Paper
Advertisement

ఈశ్వర్ సాయి గురించి లేఖ బయట పెట్టిన మాధురి రాథోడ్!

ఈశ్వర్ సాయి గురించి లేఖ బయట పెట్టిన మాధురి రాథోడ్!
Advertisement

Madhuri Rathod:ప్రమీల ఓ ప్రమీల, బాసింగ బలాలే అనే ఫోక్ సాంగ్ లతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న డాన్సర్ ఈశ్వర్ సాయి (Eshwar Sai) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అయితే ఈ పాటలలో ఈశ్వర్ సాయితో పాటు ఆడి పాడిన మాధురి రాథోడ్ (Madhuri Rathod) ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. కష్టపడి ఇన్ని రోజులు ఒక్కో మెట్టు ఎదుగుతూ తమ స్పెషల్ ఆల్బమ్ సాంగ్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ జంట అనూహ్యంగా వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. వేములవాడ పట్టణంలోని రెడ్డి భవన్లో ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ తో రెడ్ హ్యాండెడ్గా ఆయన భార్య శరణ్యకు పట్టుబడ్డారు.

ఈశ్వర్ సాయి గురించి లేఖ బయటపెట్టిన మాధురి రాథోడ్..

ఈశ్వర్ సాయి భార్య మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త మంచివాడని మాధురి రాథోడ్ వల్లే తన భర్త ఇలా చెడిపోయాడు అంటూ బహిరంగంగా కామెంట్లు చేసింది. ఆ తర్వాత వేములవాడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో వెంటనే స్పందించిన మాధురి రాథోడ్. తన ప్రమేయం లేకపోయినా బూతులు తిడుతూ రెచ్చిపోయారని, తనను దారుణంగా కొట్టారు అంటూ అదే వేములవాడ పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయి భార్య శరణ్యపై కంప్లైంట్ ఇచ్చింది.

Advertisement

ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో వెంటనే ఈశ్వర్ సాయి ఒక వీడియో రిలీజ్ చేస్తూ.. తన భార్య తరఫున క్షమాపణలు కోరుతూ.. తాను మాధురితో చాలా క్లోజ్ గా ఉంటానని, ఆ కారణంతోనే ఆమె గదిలో ఉన్న వాష్ రూమ్ వాడుకోవడానికి వెళ్ళానని, అంతలోనే తన భార్య వచ్చి ఇలా వీడియో తీస్తూ నానా రభస చేసిందని, ఇందులో మాధురి తప్పేం లేదంటూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అంతా సర్దుమణిగింది అనుకునే లోపే మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి గురించి ఒక లేఖ విడుదల చేసింది అంటూ ఒక లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి ఆ లెటర్లో ఏముందో ఇప్పుడు చూద్దాం..

also read:రజనీకాంత్ మూవీలో విలన్ గా తెలుగు హీరో.. మాస్ ర్యాంపేజ్ షురూ!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడు – మాధురి రాథోడ్

Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ లేఖలో ఏముంది అనే విషయానికొస్తే..” మీకేం తెలుసండి.. మా ఇద్దరి మధ్య ఏం లేదని ఎలా అంటారు ? నేను , ఈశ్వర్ సాయి ఇద్దరం కలిసి పనిచేస్తున్నాము. ఒకరోజు ఈశ్వర్ సాయి నాకు ప్రపోజ్ చేశాడు. నీకు ఆల్రెడీ పెళ్లి అయి, కొడుకు ఉన్నాడు కదా అని నేను రిజెక్ట్ చేసాను.. నీకు పెళ్లయింది కదా ..ఇదేం పని అని కూడా చెప్పాను. కానీ ఈశ్వర్ సాయి నేను నా పెళ్ళాన్ని వదిలేస్తాను అని నాతో చెప్పి, ప్రామిస్ కూడా ఇచ్చాడు. తన మాటలన్నీ నేను నమ్మాను. ఇక మేము ఫిజికల్ గా ఎన్నోసార్లు కలిసాము. వేరువేరు లొకేషన్లో కూడా చాలాసార్లు కలిసాము.

నాకు న్యాయం కావాలి – మాధురి రాథోడ్

అయితే ఆగస్టు 19న హోటల్లో జరిగిన ఘటన తర్వాత ఆయన భార్య వచ్చి మొత్తం నేనే చేసినట్టుగా చెప్పింది. అక్కడినుంచి ఈశ్వర్ సాయి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇక దీనిపై నాకు న్యాయం కావాలి ” అంటూ మాధురి రాథోడ్ ఈ లేఖ రాసింది అంటూ ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇది మాత్రం మాధురి రాథోడ్ షేర్ చేసింది అంటూ ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై ఆమె ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

Big Stories

Advertisement
×