Pawan Kalyan: దశాబ్ద కాలానికి పైగా భుజాల నొప్పితో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ ఆసుపత్రిలో తన కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రివర్యులు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, అనగాని సత్య ప్రసాద్, ఎంపీ లింగమనేని రమేష్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాస్పిటల్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్ వైద్య బృందంతో అలాగే పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తగినంత విశ్రాంతి తీసుకోవాలని.. పూర్తిస్థాయిలో వేగంగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.
అనంతరం మీడియాతో సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. “ప్రజా క్షేత్రంలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతనోత్సాహంతో, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారు. ఆయనకు చాలా కీలకమైన శస్త్ర చికిత్స జరిగింది. మూడున్నర గంటల పాటు అత్యున్నత వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఏళ్ల తరబడి ఉన్న తీవ్రమైన గాయాన్ని ఆయన ప్రజాసేవలో నిమగ్నమై నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో ఆయన పూర్తిగా కోలుకుంటున్నారు. సంవత్సరాల తరబడి రెండు భుజాలకు ఉన్న తీవ్రమైన గాయాలను ప్రజాసేవలో నిమగ్నమై పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. చిన్న చిన్న విషయాలను ఆయన పట్టించుకోరు. ప్రజల్లో ఉన్నప్పుడు పర్యటనల సమయంలో ఆయన మీదకి అభిమానులు ఆప్యాయంగా దూసుకురావడం, చేతులు పట్టుకొని పక్కకు లాగడం, తోపులాట వల్ల భుజాలకు ఉన్న సమస్య మరింత తీవ్రతరం అయింది.
ఇటీవల ఆయన వైద్య పరీక్షలకు వచ్చిన సమయంలోనే సమస్య తీవ్రమైనదిగా గుర్తించి వెంటనే కుడి భుజానికి సర్జరీ అవసరమని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కుడి భుజానికి సర్జరీ సక్సెస్ అయ్యింది.దాని తర్వాత వైద్యుల పర్యవేక్షణ, ఫిజియోథెరపీ వంటివి ఉంటాయి. మూడు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ చేయడం వల్ల భుజానికి ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. రెండో భుజానికి కూడా సమస్య ఉంది. అయితే కుడి భుజానికి ఉన్న సమస్య తీరిన ఆరు నెలల తర్వాత మళ్లీ వైద్యులు పరీక్షలు చేస్తారు.. అప్పుడు ఎడమ భుజానికి ఆపరేషన్ అవసరమవుతుందా? లేక ఫిజియోథెరపీతో పరిష్కారం అవుతుందా? అన్నది స్పష్టంగా తేలుతుంది. పవన్ కళ్యాణ్ నూతన ఉత్సాహంతో, పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాసేవలోకి వస్తారు.
also read:ఇండస్ట్రీలో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ మధ్య వాగ్వాదం!
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది” అంటూ ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స పూర్తయిందని.. కాకపోతే మూడు వారాలపాటు వైద్య బృందం సమక్షంలో ఫిజియోథెరపీ తో పాటు తగిన విశ్రాంతి అవసరమని ఆయన స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన చంద్రబాబు
ఇటీవల భుజం సర్జరీ చేయించుకుని ముంబై ఆస్పత్రిలో కోలుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు, ఆయన త్వరగా… pic.twitter.com/OxfvC3dOkW
— BIG TV Breaking News (@bigtvtelugu) July 12, 2026