E-Paper
Advertisement

జానకమ్మ అంత్యక్రియలు మైసూర్ లోనే ఎందుకు?

జానకమ్మ అంత్యక్రియలు మైసూర్ లోనే ఎందుకు?
Advertisement

S.Janaki:లెజెండ్రీ సింగర్ గా పేరు సొంతం చేసుకున్న ఎస్ జానకి జూలై 11 వ తేదీన శనివారం రోజు మైసూర్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. ఇకపోతే జూలై 12న ఆదివారం సాయంత్రం 5 గంటలకు మైసూర్ లోని బోగాది సమీపంలోని కణియర హుండీ గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇకపోతే ఈమె పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్లో అయితే.. కర్ణాటక రాష్ట్రం మైసూర్ లోనే ఎందుకు ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు? అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది . మరి జానకమ్మ అంత్యక్రియలు మైసూర్ లోనే ఎందుకు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారో ఇప్పుడు చూద్దాం..

మైసూర్ లోనే జానకమ్మ అంత్యక్రియలు ఎందుకంటే?

అసలు విషయంలోకి వెళ్తే.. తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగినా.. తన 60 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ కు చెన్నై చిరునామాగా ఉన్నప్పటికీ.. జానకి అంత్యక్రియలు కర్ణాటక రాష్ట్రం మైసూర్ లోనే జరగడం వెనుక ప్రత్యేక కారణం ఉంది . 2016లో కెరియర్ కు స్వస్తి పలికిన జానకమ్మ.. 2017లో అక్కడే తన చివరి ప్రదర్శన ఇచ్చారు. తన శేష జీవితాన్ని ప్రశాంతంగా మైసూర్ లోనే గడపాలని ఆమె నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అలా కొన్నాళ్లు చెన్నై, కొన్నాళ్ళు మైసూర్ లోనే ఉన్న జానకమ్మ.. చివరికి మైసూర్ లోనే తుది శ్వాస విడిచారు. ఇక ఆమె కోరిక మేరకు ఆమె మరణాంతరం ఆమె అంత్యక్రియలను మైసూర్ లోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు మరి కాసేపట్లో భౌతికంగా మనకు దూరమైన జానకమ్మ.. ఇక శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్లిపోనున్నారు.

జానకమ్మ బాల్యం, విద్యాభ్యాసం..

Advertisement

జానకమ్మ బాల్యం, విద్యాభ్యాసం విషయానికి వస్తే.. 1938 ఏప్రిల్ 23వ తేదీన గుంటూరులో జన్మించారు. ఈమె తండ్రి శ్రీరామమూర్తి.. ఈయన ఆయుర్వేద వైద్యుడు. అలాగే ఉపాధ్యాయుడు కూడా.. ఈమె బాల్యం మొత్తం ఎక్కువగా సిరిసిల్లలోనే కొనసాగింది. సినిమా పాటల పై వ్యామోహం ఉన్న జానకి తొమ్మిదేళ్ల వయసులోనే తొలిసారి వేదికపై ప్రదర్శన ఇచ్చే అవకాశాన్ని అందుకున్నారు . ప్రముఖ నాదస్వర విద్వాంసుడైన పైడిస్వామి వద్ద సంగీతంలోని ప్రాథమిక అంశాలను నేర్చుకున్న ఈమె.. శాస్త్రీయ సంగీతంలో ఎటువంటి అధికారిక శిక్షణను అభ్యసించలేదు.

60 ఏళ్ల కెరియర్లో 50వేలకు పైగా పాటలు..

జానకి 1959లో వి రామ్ ప్రసాద్ అనే దగ్గర బంధువు అయిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన ఈమె కెరియర్ ను విపరీతంగా ప్రోత్సహించారు. అయితే 1997లో రామ్ ప్రసాద్ గుండెపోటుతో మరణించారు. ఈమెకి ఉన్న ఒక్కగానొక కొడుకు మురళీకృష్ణ కూడా ఈ ఏడాది ఆరంభంలో గుండెపోటుతో మరణించారు. జానకి మాతృభాష తెలుగే అయినప్పటికీ.. భారతదేశంలోని ప్రధాన భాషలైన కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, ఒడియా, తుళు , ఉర్దూ, కొంకని , పంజాబీ , బెంగాలీతో సహా సుమారుగా 17 కి పైగా భాషలలో పాటలు పాడి శ్రోతలను అలరించారు.

మేనమామ ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు..

Advertisement

డెక్కన్ నైటింగేల్ గా పేరు దక్కించుకున్న ఈమె తన మేనమామ సలహా మేరకు 20 ఏళ్ల వయసులో చెన్నైలోని ఏవీఎం స్టూడియోస్ లో సంగీత దర్శకుడు ఆర్.సుదర్శనం దగ్గర గాయనిగా పనిచేయడానికి వెళ్ళారు. అక్కడ 1957లో విధియిన్ విలయట్టు అనే తమిళ చిత్రంలో తొలిసారి నేపథ్య గాయనిగా పనిచేసి తన కెరీర్ ను ఆరంభించారు. తొలిసారి ఎమ్మెల్యే అనే తెలుగు చిత్రంలో పాటలు పాడారు.ఇక తన కెరియర్ మొదలు పెట్టిన మొదటి సంవత్సరంలోనే ఏకంగా ఆరు భాషలలో సినిమా పాటలు పాడి అందరి దృష్టిని ఆకర్షించారు. అలా ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో 17కి పైగా భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడి సరికొత్త సంచలనం సృష్టించి లెజెండ్రీ సింగర్ గా పేరు దక్కించుకున్నారు జానకి.

also read: ప్రేమించి పెళ్లి చేసుకున్న జానకి.. అంత నరకం అనుభవించిందా?

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×