E-Paper
Advertisement

సింగర్ ఎస్.జానకి నటించిన మూవీ.. డిలీటెడ్ సీన్ వైరల్!

సింగర్ ఎస్.జానకి నటించిన మూవీ.. డిలీటెడ్ సీన్ వైరల్!
Advertisement

S.Janaki: డెక్కన్ నైటింగేల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్.జానకి జూలై 11 శనివారం రోజు రాత్రి 7:30 గంటల సమయంలో మైసూర్ లోని అపోలో హాస్పిటల్ లో అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం మైసూర్ లోనే ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో జానకికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే జానకి మరణించిన నేపథ్యంలో ఆమె ఒక సినిమాలో నటించగా.. ఆ సినిమా నుండి ఆ సన్నివేశాలను తొలగించారు. అయితే అలా తొలగించిన సన్నివేశాలను అధికారికంగా ఆ చిత్ర బృందం విడుదల చేసి ఆమెకు నివాళులు అర్పించారు.

జానకమ్మ నటించిన మూవీ నుండి డిలీటెడ్ వీడియో వైరల్..

ఆ చిత్రం ఏదో కాదు.. తమిళంలో క్లాసిక్ లవ్ స్టోరీ గా నిలిచిన 96. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా.. లేడీ స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే 96. ఈ చిత్రానికి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సింగర్ జానకి ఒక ప్రత్యేక పాత్రలో మెరిశారు. అయితే థియేటర్లలో విడుదల అవ్వడానికంటే ముందే నిడివి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సినిమా నుండి ఆ సన్నివేశాన్ని తొలగించారు. ఆ తర్వాత చిత్ర బృందం ఈ డిలీటెడ్ సీన్ ను ఇప్పుడు తాజాగా అధికారికంగా విడుదల చేసింది.

సహజ నటనతో ఆకట్టుకున్న జానకమ్మ..

Advertisement

ఇకపోతే త్రిష, విజయ్ సేతుపతి, జానకి కలయిక లో ఉన్న ఈ డిలీటెడ్ సీన్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంత అద్భుతమైన సన్నివేశాన్ని ఎందుకు సినిమా నుండి తొలగించారు అంటూ సినీ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే జానకమ్మ పాటలతోనే కాదు నటనలో కూడా అదరగొట్టేశారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

also read:Samantha:బేబీ బంప్ తో సమంత.. స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన రాజ్!

జానకమ్మ మృతి పట్ల నటి త్రిష సంతాపం..

Advertisement

ఇకపోతే మరొక పక్క జానకి మృతి పట్ల ప్రముఖ సినీనటి త్రిష సంతాపం వ్యక్తం చేశారు. తన కెరీర్ లోని ఒక ప్రత్యేకమైన సినిమాలో జానకమ్మ పేరు పెట్టుకోవడం తనకు దక్కిన గొప్ప గౌరవమని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ విషయంపై ఆమె సోషల్ మీడియా ద్వారా..” జానకమ్మా .. మిమ్మల్ని కలవడం, మీ ప్రేమను పొందడం నిజంగా నా పూర్వజన్మ అదృష్టం. మీ ఆప్యాయత, చిరునవ్వును నేను ఎప్పటికీ మరువలేను. గొప్ప కళాకారులు సాధారణంగా ఉంటారని మీరు మళ్ళీ మళ్ళీ నిరూపించారు. మీ మధురమైన గొంతు ఎప్పటికీ కూడా సజీవంగానే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం జానకమ్మ” అంటూ భావోద్వేగంతో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు త్రిష. ఇక ప్రస్తుతం త్రిష షేర్ చేసిన పోస్ట్, 96 మూవీ మేకర్స్ విడుదల చేసిన జానకమ్మ నటన డిలీటెడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related News

Samantha:బేబీ బంప్ తో సమంత.. స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన రాజ్!

జానకమ్మ అంత్యక్రియలు మైసూర్ లోనే ఎందుకు?

singer Janaki:ప్రేమించి పెళ్లి చేసుకున్న జానకి.. అంత నరకం అనుభవించిందా?

పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించిన జానకమ్మ.. ఆస్తుల చిట్టా తెలిస్తే షాకే!

ప్రభుత్వ లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు నేడే.. చివరి కోరిక మేరకు అక్కడే!

Kollywood : రూ. 1.80 కోట్ల బకాయిల వివాదం.. స్టార్ హీరో పై చీటింగ్ కేసు నమోదు..

బ్యాక్ లెస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న పచ్చళ్ళ పాప.. బాపురే కుర్రాళ్లకు కష్టమే..!

Big Stories

Advertisement
×