E-Paper
Advertisement

Samantha:బేబీ బంప్ తో సమంత.. స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన రాజ్!

Samantha:బేబీ బంప్ తో సమంత.. స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన రాజ్!
Advertisement

Samantha:సినిమాలు, సిరీస్ లు అంటూ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు దక్కించుకుంది సమంత. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈమె.. వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను చేరుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. గత మూడేళ్ల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత.. మళ్ళీ తెలుగు ప్రేక్షకుల వైపు చూడలేదు. కానీ మూడేళ్ల తర్వాత మా ఇంటి బంగారం అనే ఫ్యామిలీ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది

సమంతకి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన రాజ్..

ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో నాలుగవసారి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా తాను గర్భవతిని అని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఒకవైపు తన సినిమా థియేటర్లలో దూసుకుపోతుంటే.. మరొకవైపు మెటర్నటీనీ ఎంజాయ్ చేయడానికి వెకేషన్ కి వెళ్ళింది. సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఈమె భర్త రాజ్ ఈమెకు ఊహించని సర్ప్రైజ్ ఉంచారు.

100 కోట్లకు క్లబ్లో మా ఇంటి బంగారం..

Advertisement

ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. “విడుదలకు ముందు ఒక హీరోయిన్ సినిమాను ఎవరైనా ఎందుకు చూస్తారు ? అని ఒక ఎగ్జిబిటర్ అడిగారు. కానీ సాహసంతోనే సక్సెస్ వస్తుందని ఈ చిత్రం నిరూపించింది” అంటూ రాసుకు వచ్చారు. ఇక ఆ సర్ప్రైజ్ ఏంటో కాదు మా ఇంటి బంగారం సినిమా రూ.100 కోట్ల కలెక్షన్లను దాటింది అనే సర్ప్రైజ్ ఆమెకు ఇచ్చారు. ఇక రాజ్ ఇచ్చిన అద్భుతమైన సర్ప్రైజ్ కి సంతోషం వ్యక్తం చేశారు సమంత. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో సమంత బేబీ బంప్ తో చాలా కూల్ గా కనిపించారు.

also read:జానకమ్మ అంత్యక్రియలు మైసూర్ లోనే ఎందుకు?

లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పెద్ద సవాల్..

Advertisement

ఇక మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. మొదటి రోజే మంచి కలెక్షన్లు రాబట్టి అందర్నీ ఆకట్టుకున్న ఈ సినిమా కేవలం నెల కూడా తిరగకుండానే ఏకంగా 100 కోట్ల మార్క్ ను అధిగమించి టాలీవుడ్ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం.. అందులోనూ నెలలోపే రూ.100 కోట్లు వసూలు సాధించడం ఇదే మొదటిసారి. ఇక ఈ భారీ విజయంతో సమంత తన టాలెంట్ ఏంటో మరోసారి నిరూపించింది అంటూ నెటిజన్లు కూడా ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ ఘనత భవిష్యత్తులో వచ్చే మహిళా ప్రధాన చిత్రాలకు ఒక పెద్ద సవాలుగా మారనుంది అనడంలో సందేహం లేదు.

సరికొత్త రికార్డు సృష్టించిన సమంత..

ఇకపోతే సమంత తన సొంత నిర్మాణ సంస్థ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ దర్శకులు రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి కథను అందించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు . బలమైన కథనం, ప్రేక్షకుల నుంచి వస్తున్న సానుకూల స్పందనతోనే ఈ సినిమా ఈ రికార్డులు సృష్టిస్తోంది అంటూ చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది.

Related News

సింగర్ ఎస్.జానకి నటించిన మూవీ.. డిలీటెడ్ సీన్ వైరల్!

జానకమ్మ అంత్యక్రియలు మైసూర్ లోనే ఎందుకు?

singer Janaki:ప్రేమించి పెళ్లి చేసుకున్న జానకి.. అంత నరకం అనుభవించిందా?

పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించిన జానకమ్మ.. ఆస్తుల చిట్టా తెలిస్తే షాకే!

ప్రభుత్వ లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు నేడే.. చివరి కోరిక మేరకు అక్కడే!

Kollywood : రూ. 1.80 కోట్ల బకాయిల వివాదం.. స్టార్ హీరో పై చీటింగ్ కేసు నమోదు..

బ్యాక్ లెస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న పచ్చళ్ళ పాప.. బాపురే కుర్రాళ్లకు కష్టమే..!

Big Stories

Advertisement
×