Film industry: కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వీరిద్దరి వివాహం ఈ ఏడాది నవంబర్ రెండో వారంలో జరగబోతోందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గతంలో వీరిపై ఎన్నో రూమర్స్ వచ్చినప్పటికీ.. అనిరుధ్ బాబాయ్, సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో ఈ పెళ్లిని దాదాపు కన్ఫర్మ్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రేజీ మెగా వెడ్డింగ్ విశేషాలు చూద్దాం..
తమిళ మీడియా సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్-2’ సినిమా విడుదల తర్వాత అనిరుధ్-కావ్యల వివాహం జరగనుంది. ఈ సినిమా అక్టోబర్ 15న రిలీజ్ కానుండగా, ఆ తర్వాత నవంబర్ రెండో వారంలో ఈ జంట మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఇక ఇక ఈ వార్త విన్నప్పటి నుంచి అటు మ్యూజిక్ లవర్స్, ఇటు క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు.
గతంలో ఈ జంటపై ఎన్నో గాసిప్స్ వచ్చినా అవన్నీ రూమర్స్ అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ తాజాగా అనిరుధ్ బాబాయ్ వై.జి. మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నాకు తెలిసినంతవరకు వీరి పెళ్లి పక్కా, ఇది నిజంగా జరగబోయే ఒక పెద్ద పెళ్లి” అంటూ హింట్ ఇచ్చారు. ఇక ఇక కావ్య చాలా సమర్థురాలని, అనిరుధ్-కావ్య ఇద్దరూ ఒక పర్ఫెక్ట్ జంట అని ఆయన ప్రశంసించడంతో ఈ పెళ్లి న్యూస్ నిజమేనని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కావ్య మారన్ ఫ్యామిలీ నిర్మించిన ‘బీస్ట్’, ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఇక ఆ సినిమాల షూటింగ్స్, ప్రమోషన్స్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని ఇండస్ట్రీ టాక్. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల వరకు వచ్చిందని అంటున్నారు.
also read:జానీ మాస్టర్ భార్య సుమలతపై డాన్సర్లు ఆగ్రహం.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్!
వై.జి. మహేంద్రన్ మాటలతో పెళ్లి వార్త నిజమేనని అందరూ అనుకుంటున్నప్పటికీ, అటు మారన్ ఫ్యామిలీ కానీ, ఇటు అనిరుధ్ కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. గతంలో ఒకసారి పెళ్లి రూమర్స్ వచ్చినప్పుడు అనిరుధ్ సోషల్ మీడియా వేదికగా ఖండించారు. కానీ ఈసారి మాత్రం ఇరు వర్గాలు సైలెంట్‌గా ఉండటంతో ఈ సస్పెన్స్ మరింత పెరిగిపోయింది.
కోలీవుడ్ రాక్‌స్టార్, బిజినెస్ క్వీన్ కావ్య మారన్ జోడీ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కితే మాత్రం ఇది ఈ దశాబ్దపు బిగ్గెస్ట్ వెడ్డింగ్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ పెళ్లి వార్తలపై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.