BigTV English
Advertisement

Avatar 3 Trailer: అవతార్ 3 కొత్త ట్రైలర్ రిలీజ్.. జేమ్స్ ఇండియాకి వచ్చారా?

Avatar 3 Trailer: అవతార్ 3 కొత్త ట్రైలర్ రిలీజ్.. జేమ్స్ ఇండియాకి వచ్చారా?

Avatar 3 Trailer: అవతార్.. పిల్లల నుండి పెద్దల వరకు హాలీవుడ్ మొదలు టాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న ఏకైక మూవీ అవతార్.. తెలియని మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లి అందరిని ఉర్రూతలూగిస్తూ విజువల్ వండర్ గా నిలిచింది. ప్రముఖ హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకత్వంలో ఇప్పటికే రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. ఇప్పుడు అవతార్ ఫ్రాంఛైజీలో భాగంగా ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’ అంటూ ప్రకటించారు. ఇకపోతే తాజాగా ట్రైలర్ ను విడుదల చేయగా.. ఈ ట్రైలర్ విజువల్ వండర్ గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ట్రైలర్ ఎలా ఉందంటే?

తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో, ఎమోషన్స్, డ్రామా, అడ్వెంచర్ , యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ను నింపేశారు. ముఖ్యంగా ఇదివరకు భూమి మీద నీళ్లలో కథ నడిచింది. ఈసారి అగ్నితో పాండారా వాసులు ఆట ఆడబోతున్నారు అని చూపించారు. అగ్ని, నీళ్లల్లో వచ్చే సీన్స్ ఇక్కడ హైలెట్ గా కనిపిస్తున్నాయి. రెండు తెగల మధ్య జరిగే యుద్ధంతో విజువల్ వండర్ గా ఈ ట్రైలర్ అనిపిస్తోంది.. ముఖ్యంగా ఇందులో ఆ గ్రహం మీద మానవ పాత్ర ఎలాంటి మాస్క్ లేకుండా గాలి పీల్చుకోవడం అతిపెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. ఇప్పటికే అవతార్ , అవతార్ 2 సినిమాలు రికార్డులు సృష్టించాయి. అయితే ఈ రెండు చిత్రాల రికార్డులను ఇప్పుడు అవతార్ 3 తిరగరాసేలా ఉందని ట్రైలర్ అనిపిస్తోంది.

రిలీజ్ ఎప్పుడంటే?


ఇదివరకే గత రెండు నెలల క్రితం అవతార్ 3 మొదటి ట్రైలర్ రిలీజ్ అయింది. తాజాగా రెండవ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

జేమ్స్ కామెరూన్ ఇండియాకి వచ్చారా?

ఇదిలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్, ఇండియాకి వస్తారని.. ఆయన చేతుల మీదుగానే ఈ ట్రైలర్ రిలీజ్ అవుతుందని మొదట్లో అందరూ అనుకున్నారు.. కానీ డిసెంబర్ 19న రిలీజ్ కాబట్టి విడుదల తేదీకి కేవలం రెండు మూడు రోజులు ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఇండియాకి వస్తారని.. అలా తన సినిమాను ఇండియాలో ప్రమోట్ చేయడమే కాకుండా రాజమౌళి (Rajamouli), మహేష్ బాబు (Maheshbabu) కాంబినేషన్లో వస్తున్న ‘ ఎస్ఎస్ఎంబి 29’ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా వదులుతారని సమాచారం. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ అవతార్ ఫైర్ అండ్ యాష్ మరో సంచలనం సృష్టిస్తుందని అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ విశేషాలు..

అవతార్ ఫిలిం సిరీస్ లో భాగంగా అవతార్ : ఫైర్ అండ్ యాష్ చిత్రం రాబోతోంది. ఇందులో సామ్ వర్తింగ్టన్, జోయ్ సల్డానా, స్టీఫెన్ లాంగ్, సిగౌర్ని వీవర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో 20 సెంచరీ స్టూడియో సమర్పణలో లైట్ స్టార్ బ్యానర్ పై ఈ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

Related News

Sigma : సందీప్ కిషన్ తో విజయ కొడుకు చేయబోయే సినిమా కథ ఇదే

SS Rajamouli : గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కి నో కెమెరాస్, తమిళ్ ఇండస్ట్రీని ఫాలో అవుతున్నారా?

50 Years Of Mohan Babu : మోహన్ బాబుకు గ్రాండ్ ఈవెంట్, ఈసారి ఏ వైరల్ స్పీచ్ ఇస్తారో?

Ravi Babu : చివరిసారిగా అతని కాళ్ళను తాకాను, రామానాయుడు గొప్పతనం ఇదే

SSMB29: పాట వింటుంటే టైటిల్ అదే అనిపిస్తుంది, వారణాశి నా లేక సంచారి నా?

Mowgli: సందీప్ రాజ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం, అసలు కారణం ఏంటి?

Shiva Remake: శివ రీమేక్ .. ఆ హీరోలకు అంత గట్స్ లేవన్న కింగ్..ఇలా అనేశాడేంటీ?

Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు

Big Stories

×