Shiva Remake: టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ హవ కొనసాగుతూనే ఉంది. ఇటీవల బాహుబలి ది ఎపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే మరొక సూపర్ హిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)దర్శకత్వంలో నాగార్జున (Nagarjuna),అమల(Amala) హీరో హీరోయిన్లుగా నటించిన శివ సినిమా(Shiva Movie) అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఈ సినిమా కల్ట్ క్లాసిక్ మూవీ గానే నిలిచిందని చెప్పాలి. ఇలాంటి సూపర్ హిట్ సినిమా తిరిగి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా నవంబర్ 14వ తేదీ తిరిగి 4కె వర్షన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఎంతో మంది అభిమానులు ఈ సినిమాని మరోసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. తాజాగా నాగర్జున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సీక్వెల్ అలాగే రీమేక్ గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.
శివ సినిమాని కనుక రీమేక్ చేయాల్సి వస్తే నాగచైతన్య(Naga Chaitanya) లేదా అఖిల్(Akhil) తో రీమేక్ చేయగలరా అంటూ ప్రశ్నలు ఎదురవడంతో నాగార్జున షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ సినిమాని రీమేక్ చేసే అంత గట్స్ నాగచైతన్య అఖిల్ కి లేవని నేను అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు నాగార్జున తప్ప మరెవరిని ఊహించుకోలేమని నాగార్జున మాత్రమే ఆ పాత్రకు సూట్ అవుతారని అభిమానులు కూడా భావిస్తున్నారు.
శివ ప్రమోషన్లలో బిజీగా నాగ్…
ఇక ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాకి కూడా సీక్వెల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని వర్మ క్లారిటీ ఇచ్చారు. థియేటర్లలో విడుదలైన దాదాపు 36 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో కేవలం అభిమానులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ప్రమోషన్లలో భాగంగా నాగార్జున వర్మ ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో అంశాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇక నాగార్జున కెరియర్ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నాగార్జున కుబేర కూలి సినిమాలలో క్యామియో పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.
Also Read: SSMB 29: ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ ఇదేనా? సాంగ్ తో హింట్ ఇచ్చిన జక్కన్న!