BigTV English
Advertisement

Mowgli: సందీప్ రాజ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం, అసలు కారణం ఏంటి?

Mowgli: సందీప్ రాజ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం, అసలు కారణం ఏంటి?

Mowgli: ఇండస్ట్రీలో వారసత్వపు హీరోలు ఉన్నారు. అయితే సక్సెస్ కొట్టడం అనేది అంత తేలికైన పని కాదు. అఖిల్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కొంతమేరకు మంచి పేరుని తీసుకొచ్చింది.


ఇక పూరి జగనన్న తనయుడు ఆకాష్ కి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ సినిమా లేదు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల కొడుకు కూడా బబ్లుగం అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఒక ప్రస్తుతం సందీప్ రాజ్ దర్శకత్వంలో మొగ్లీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తుంది చిత్ర యూనిట్. ఈ తరుణంలో దర్శకుడు సందీప్ రాజ్ పైన ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సందీప్ రాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం 

సందీప్ రాజ్ చాయ్ బిస్కెట్లో కెరియర్ స్టార్ట్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. కలర్ ఫోటో సినిమాతో దర్శకుడుగా మారిన సందీప్ మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఆ సినిమా కరోనా కారణం వలన థియేటర్స్ లో విడుదల కాలేదు.


కలర్ ఫోటో సినిమా తరువాత ఇప్పటివరకు సందీప్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు మోగ్లీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.

ఈ తరుణంలోనే సందీప్ పైన నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సందీప్ కేవలం దర్శకుడుగా మాత్రమే కాకుండా నటుడుగా నిర్మాతగా కూడా అందరికీ సుపరిచితమే. ఈటీవీ విన్ యాప్ లో ఎయిర్ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. దాంట్లో ఒక సామాజిక వర్గాన్ని ట్రోల్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి. దానివలన విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. అలా నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్లలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

అవసరానికి వాడుకుంటున్నారా?

మీరు నిర్మాతగా వ్యవహరించే కొన్ని సినిమాల్లో మా హీరోలను టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. కులాల పైన జోక్స్ కూడా వేశారు. ఇప్పుడు మాత్రం మీ సినిమా ప్రమోషన్ కి మా హీరో కావాల్సి వచ్చిందా అంటూ ట్విట్టర్లో సందీప్ ను టార్గెట్ చేశారు.

అయితే సందీప్ కూడా తనను విపరీతంగా టార్గెట్ చేసిన వాళ్ళని బ్లాక్ చేస్తూ, తన పని తాను చేసుకుంటున్నాడు. ఇకపోతే ఈ ఇష్యూ కి సంబంధించి మొగ్లీ సినిమా ఈవెంట్లో సందీప్ ఏమైనా మాట్లాడుతాడేమో వేచి చూడాలి. ఎందుకంటే తమ ఫంక్షన్ కి ఏదైనా హీరో వస్తే వాళ్లకు ఎలివేషన్ ఇవ్వడం అనేది సాధారణంగా జరిగే పని.

Also Read: Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు

Related News

Sigma : సందీప్ కిషన్ తో విజయ కొడుకు చేయబోయే సినిమా కథ ఇదే

SS Rajamouli : గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కి నో కెమెరాస్, తమిళ్ ఇండస్ట్రీని ఫాలో అవుతున్నారా?

50 Years Of Mohan Babu : మోహన్ బాబుకు గ్రాండ్ ఈవెంట్, ఈసారి ఏ వైరల్ స్పీచ్ ఇస్తారో?

Ravi Babu : చివరిసారిగా అతని కాళ్ళను తాకాను, రామానాయుడు గొప్పతనం ఇదే

SSMB29: పాట వింటుంటే టైటిల్ అదే అనిపిస్తుంది, వారణాశి నా లేక సంచారి నా?

Shiva Remake: శివ రీమేక్ .. ఆ హీరోలకు అంత గట్స్ లేవన్న కింగ్..ఇలా అనేశాడేంటీ?

Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు

Big Stories

×