BigTV English
Advertisement

SSMB29: పాట వింటుంటే టైటిల్ అదే అనిపిస్తుంది, వారణాశి నా లేక సంచారి నా?

SSMB29: పాట వింటుంటే టైటిల్ అదే అనిపిస్తుంది, వారణాశి నా లేక సంచారి నా?

SSMB29 : ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్యూరియాసిటీతో చాలామంది ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ Ssmb29. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తాదా అని మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు చాలామంది అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. వారందరికీ నవంబర్ 15న అదిరిపోయే ఈవెంట్ ప్లాన్ చేశాడు రాజమౌళి.


ఈ ఈవెంట్ మీద కూడా చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ నెలకొంది. అయితే ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది టాలీవుడ్ వర్గాల్లో ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ ఆల్రెడీ ఫిక్స్ చేశారు అంటూ కథనాలు కూడా. ఈ తరుణంలో మరో చిన్న సినిమా కూడా ఇదే పేరుతో ఒక సినిమాను ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. ఇలా అనౌన్స్ చేసిన ప్రతిసారి మహేష్ బాబు వారణాసి అనో, ఇంకేదో అనో టైటిల్స్ చేంజ్ చేయడం సహజంగా జరుగుతుంది మరి ఈ సినిమాకి ఏం చేస్తారో చూడాలి.

పాట వింటుంటే అదే టైటిల్ 

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు కీరవాణి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతను ఎన్ని సినిమాలు చేసినా కూడా ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే మాత్రం ఇంకో మెట్టు ఎక్కువ స్థాయిలోనే సంగీతం అందిస్తారు.


రాజమౌళి సినిమాల్లో గమనిస్తే కీరవాణి సంగీతానికి ఒక సెపరేట్ సిగ్నేచర్ ఉంటుంది. ఒక మామూలు సన్నివేశాన్ని కూడా తన నేపద్య సంగీతంతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంటాడు కీరవాణి. రాజమౌళి చేసిన చాలా సినిమాలు దానికి ఉదాహరణలు.

ఇక రాజమౌళి మహేష్ బాబు తో చేస్తున్న సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక సాంగ్ విడుదల చేశారు. ఆ సాంగ్ లో

కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజు పరుగేలే

వేగాన్ని శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే

ఖండాలే దాటేస్తూ..

రా రా ధీర, ధ్రువ తారా సైరా సంచార,

సంచారి సంహరి మృత్యుపై తన స్వారీ

ఈ లిరిక్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాకి సంచారి అనే టైటిల్ కూడా కరెక్ట్ గా ఉంటుంది అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అదే టైటిల్ పెడతారా? 

మహేష్ బాబు ఈ ఈ సినిమా అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. అడ్వెంచర్ ఫిలిం అంటే తిరుగుతూ ఉంటాడు ఎక్కడకి పడితే అక్కడికి. అలా తిరిగే వాడిని సంచారి అని అంటారు. ఈ సంచారి అనే టైటిల్ సినిమాకి కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే పాటలో అదే ఉంది కాబట్టి. అది కాకుండా వారణాసి అని పెడతారా లేకపోతే సంచారి నే అని ఎవరు ఊహించని విధంగా టైటిల్ ఫిక్స్ చేస్తారా అని అనేది చాలామందికి వస్తున్న సందేహం. ఇక టైటిల్ నవంబర్ 15 అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Also Read: Mowgli: సందీప్ రాజ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం, అసలు కారణం ఏంటి?

Related News

SS Rajamouli : గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కి నో కెమెరాస్, తమిళ్ ఇండస్ట్రీని ఫాలో అవుతున్నారా?

50 Years Of Mohan Babu : మోహన్ బాబుకు గ్రాండ్ ఈవెంట్, ఈసారి ఏ వైరల్ స్పీచ్ ఇస్తారో?

Ravi Babu : చివరిసారిగా అతని కాళ్ళను తాకాను, రామానాయుడు గొప్పతనం ఇదే

Mowgli: సందీప్ రాజ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం, అసలు కారణం ఏంటి?

Shiva Remake: శివ రీమేక్ .. ఆ హీరోలకు అంత గట్స్ లేవన్న కింగ్..ఇలా అనేశాడేంటీ?

Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు

RGV: శివ కథను 20 నిమిషాల్లో రాశా, అక్కడి నుంచి కాపీ చేసా

Big Stories

×