Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో వరుణుడు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. నిన్న సాయంత్రం వరకు కాస్త బ్రేక్ ఇచ్చినట్టు కనిపించినా రాత్రి నుంచి పలుచోట్ల మళ్లీ భారీ వర్షం కురిసింది. ఇక తెల్లవారుజామున కూడా నేనెక్కడికీ వెళ్లలేదన్నట్టు మళ్లీ వర్షం స్టార్ట్ అయింది. తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం దంచికొడుతుంది. గురువారం రాత్రి మొదలైన వాన ఇప్పటికి తగ్గడం లేదు.. పలు ప్రాంతాలు కూకట్‌పల్లి, బంజారాహిల్స్, మలక్‌పేట్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, మాదాపూర్, అమీర్‌పేట్, ఎల్‌బీనగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కొండాపూర్, రాయదుర్గం, సంతోష్ నగర్, మియాపూర్, హైటెక్‌సీటి, లింగంపల్లి, హయత్‌నగర్, వనస్థలిపురం, జగద్గిరిగుట్ట, బోరబండ, శంకర్‌పల్లీ, దిల్‌సుఖ్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్టు, ఇనాంగూడ, సుచిత్ర, గచ్చిబౌలి, ముషీరబాద్ పరిసరా ప్రాంతాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. అంతేకాకుండా మరో రెండు గంటల్లో హైదరాబాద్ మొత్తం వర్షం కురుస్తుందని తెలిపారు.
జలమయంగా మారిన రోడ్లు..
భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ చెరువులై పారుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లపై మొత్తం నీరు ఉండటతో గుంతలు కనిపించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాహనదారులు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున వాహనదారులు ఎంత త్వరగా ఇంటికి చేరుకుంటే అంతా మంచిదని చెబుతున్నారు.
Also Read: ఏపీ, తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు
మరో మూడు రోజులు ఇదే వర్షం..
అయితే మరో రెండు మూడు రోజులు వాతావరణం ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కావున ప్రజలు ఎవరు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తు్న్నారు. ఆఫీసులకు వెళ్లే వారు, తదితర ప్రాంతాలకు, ఇతర కార్యక్రమాల పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా వెళ్లాలని వర్షం తగ్గిన తర్వాత వెళ్లాలని చెప్పారు. అత్యవసరం అయితే ప్రజలు ఎవరు బయటకు రావొద్దని.. వస్తే కొట్టుకుపోతారని హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు వృద్ధులు అసలే బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. వారు ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.