Shreyas Iyer: టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer ) ఇటీవల గాయం బారిన పడ్డ సంగతి తెలిసిందే. చావు బతుకుల దాకా వెళ్లి బతికి బయటపడ్డాడు శ్రేయాస్ అయ్యర్. అలాంటి యంగ్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్, గాయం నుంచి కోలుకోని ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యాడు. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన శ్రేయాస్ అయ్యర్, మళ్లీ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాడు. ఈ సందర్భంగా విదేశాల్లో అమ్మాయిల మధ్య ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. బీచ్ నడిబొడ్డున కూర్చుని సెల్ఫీ ఫోటో దిగి షేర్ చేశాడు. తాను త్వరగా కోలుకున్నానని, ఇప్పుడు రిలాక్స్ అవుతున్నట్లు పేర్కొన్నాడు శ్రేయాస్ అయ్యారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన శ్రేయాస్ అయ్యర్ అభిమానులు సంబరపడిపోతున్నారు.
ఆస్ట్రేలియా గడ్డపై మొన్నటి వరకు జరిగిన వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer ) చావు దాక వెళ్లిన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ శ్రేయాస్ అయ్యర్ బతికి బయట పడ్డాడు. తన పక్కటెముకల వద్ద తీవ్ర గాయం అయింది. దీంతో శరీరం లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా చోటు చేసుకుంది. దీంతో దాదాపు మూడు రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందాడు శ్రేయాస్ అయ్యర్. ఆస్ట్రేలియాలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో శ్రేయాస్ అయ్యర్ కు ట్రీట్ మెంట్ అందించారు. శ్రేయాస్ అయ్యర్ ఆస్పత్రి, వైద్యం, ఖర్చులు అన్ని కూడా బీసీసీఐ దగ్గరుండి చూసుకుంది. అలా బీసీసీఐ రంగంలోకి దిగితేనే, టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer ) చావు దాక వెళ్లి, బయటపడ్డాడు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇటీవల కాలంలో మూడు వన్డేల సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ చివరి వన్డే మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కు (Shreyas Iyer ) తీవ్రమైన గాయం జరిగింది. క్యాచ్ అందుకోబోయి కుప్పకూలాడు శ్రేయస్ అయ్యర్. దీంతో ఆ గాయం తీవ్రతరమైంది. శ్రేయస్ అయ్యర్ కు ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతో ఐసీయూలో వేశారు. దాదాపు రెండు రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందిన తర్వాత శ్రేయస్ అయ్యర్ కోలుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు దగ్గరుండి బీసీసీఐ తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఫోటోలోనే తాజాగా పంచుకున్నాడు వైస్ కెప్టెన్ అయ్యర్.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
SHREYAS IYER INSTAGRAM STORY. 🌟
– Shreyas is fit and fine now..!!!! pic.twitter.com/x7pCha4v2L
— Tanuj (@ImTanujSingh) November 10, 2025