BigTV English
Advertisement

Bigg Boss 9 Telugu : ఇమ్మూ ఫ్యాన్స్ కు రక్తకన్నీరు… ముద్దుబిడ్డకు అడ్డు తొలగించడానికే ఈ బిగ్ ప్లానా ?

Bigg Boss 9 Telugu : ఇమ్మూ ఫ్యాన్స్ కు రక్తకన్నీరు… ముద్దుబిడ్డకు అడ్డు తొలగించడానికే ఈ బిగ్ ప్లానా ?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇమ్మాన్యుయేల్. ఎంటర్టైన్మెంట్ పరంగానే కాదు ఆట పరంగా కూడా అదరగొడుతున్నాడు. కానీ ఫ్యాన్స్ కు పని లేకుండా చేసి, వాళ్ళను తన చేతులతోనే నిద్ర పుచ్చుతున్నాడు. పైగా నేటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ తో పాటు హౌస్ మేట్స్ చేసిన పని చూస్తే కావాలనే ఇమ్మూని టార్గెట్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇమ్మూ విషయంలో అసలేం జరుగుతోంది? ఫ్యాన్స్ ఆందోళన దేనికి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


కెప్టెన్ కు కొత్త రూల్

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాక నామినేషన్లు అనేవి అనివార్యం. ఎంతటి సెలబ్రిటీ అయినా సరే దాని నుంచి తప్పించుకోలేరు. హౌస్ లో మొత్తం 12 నుంచి 15 మంది వరకు ఉంటారు. అందులో ఎవరి మెంటాలిటీ ఎవరికి, ఎందుకు నచ్చదు అన్నది చెప్పలేం. నామినేట్ చేయడానికి ఇది మాత్రమే రీజన్ కాదు… రీజన్ లేకపోయినా నామినేట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఈ డేంజర్ సిట్యుయేషన్ నుంచి ఇమ్మూ గత 10 వారాలుగా తప్పించుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికే వరుసగా 10 వారాల పాటు నామినేషన్లో లేని కంటెస్టెంట్ గా ఇమ్మూ బిగ్ బాస్ హిస్టరీలో చరిత్రను సృష్టించాడు. నిజానికి ఈ వారం ఇమ్మూ మరోసారి కెప్టెన్ కావడంతో అతను ఇమ్యూనిటీ తో మళ్ళీ సేఫ్ అనుకున్నారు ఆడియన్స్. కానీ బిగ్ బాస్ మాత్రం కెప్టెన్ కు ఝలక్ ఇచ్చాడు.

బిగ్ బాస్ 10వ వారం నామినేషన్లలో కెప్టెన్ కు ఇమ్యూనిటీని తొలగించే ఛాన్స్ ను హౌస్ మేట్స్ కి ఇచ్చారు. కానీ ఇంటి సభ్యులు అందరూ గంపగుత్తగా ఇమ్మాన్యుయేల్ కు గంపగుత్తగా ఇమ్యూనిటీ ఇవ్వమని ఓటు వేశారు ఒక్క భరణి తప్ప.అసలు హౌస్ మేట్స్ లో ఒక్కరికి కూడా ఇమ్మూని నామినేట్ చేయకపోవడమే ఎక్కడో తేడా కొడుతోంది భయ్యా. గతవారం రెండుసార్లు గౌరవ్ కి వెన్నుపోటు పొడిచాడు ఇమ్మూ. ఇలా అందరికీ ఏదో ఒక పాయింట్ ఉన్నా కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు అలా ఆడుతూనే ఇమ్మూని ఇరికిస్తున్నారు.


ఇదేనా స్ట్రాటజీ ?

నిజానికి ఈ వారం నామినేషన్లలో, మాములుగా హౌస్ లో ఇమ్మూతో పోలిస్తే చాలామంది వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అయినప్పటికీ అతన్ని నామినేట్ చేయకుండా అతని ఓట్లను తమవైపుకు తిప్పుకునే ప్లాన్ చేశారు కంటెస్టెంట్స్. నిజానికి బిగ్ బాస్ చరిత్రలో ఎవరైనా వరుసగా నామినేట్ కాలేదు అంటే… వాళ్లను నామినేట్ అయిన నెక్స్ట్ మినిట్ గేట్ ఓపెన్ చేసి బయటకు పంపేశారు. ఇమ్మూ విషయంలో కూడా ఇదే జరగొచ్చు. వీకెండ్ కూడా తనూజా, ఇమ్మూ సేమ్ ఓటింగ్ తో టాప్ లో ఉన్నారు. తాజా ఎపిసోడ్ లో ఆమెను రెండవసారి పిలిచి మరీ ఓటింగ్ నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారు. ఆమె ఓటు తప్పు అయినా కూడా ఇమ్మూకు వచ్చిన నష్టం ఏమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సడన్ గా నామినషన్లలోకి వచ్చి, ఇమ్మూ గనుక ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ అయినట్టే. దీంతో ఇమ్మూను అడ్డు తొలగించుకోవడానికే ఇలా నామినేట్ కాకుండా చేశారంటూ ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు.

Read Also ; దివ్యను దులిపేసిన రీతూ… భరణి భయ్యా ఇదస్సలు ఊహించలే… కెప్టెన్ ఇమ్మూకు క్రేజీ షాక్

Related News

Bigg Boss 9 : పోకిరి లెవెల్ ట్విస్ట్, దివ్య కు ఇచ్చి పడేసిన భరణి, అసలైన విలనిజం

Bigg Boss 9 Telugu Day 64 : దివ్యను దులిపేసిన రీతూ… భరణి భయ్యా ఇదస్సలు ఊహించలే… కెప్టెన్ ఇమ్మూకు క్రేజీ షాక్

Bigg Boss 9: ఈవారం నామినేషన్స్ లోకి వచ్చింది ఎవరంటే?

Bigg Boss 9 Promo : ఫుడ్‌పై ఉన్న ఫోకస్ గేమ్‌పై లేదు… గౌరవ్‌ను గజగజ వణికించారు.!

Bigg Boss 9 Promo: ఇదెక్కడి గోలరా.. ఆమె మాట వింటారంటున్న రీతూ!

Bigg Boss : బిగ్ బాస్ ఫైనల్ విజేత ఆమె.. ప్రైజ్ మనీ భారీగా కట్.. ఎందుకంటే?

Bigg Boss 9 Telugu: జాక్ పాట్ కొట్టేసాడే.. అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్..?

Big Stories

×