BigTV English
Advertisement

Ravi Babu : చివరిసారిగా అతని కాళ్ళను తాకాను, రామానాయుడు గొప్పతనం ఇదే

Ravi Babu : చివరిసారిగా అతని కాళ్ళను తాకాను, రామానాయుడు గొప్పతనం ఇదే

Ravi Babu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన దర్శకులలో రవిబాబు ఒకరు. కేవలం కేవలం దర్శకుడుగా మాత్రమే కాకుండా నటుడుగా కూడా మంచి గుర్తింపు సాధించుకున్నారు రవిబాబు. కొన్ని సినిమాల్లో రవిబాబు చేసిన విననిజం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. మురారి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో కనిపించింది కొద్దిసేపు అయినా కూడా అతని మార్క్ తెలుస్తుంది.


రవిబాబు అల్లరి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు. ప్రముఖ దర్శకుడు ఇవి సత్యనారాయణ కుమారుడిగా అల్లరి సినిమాతో నరేష్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి నరేష్ పేరు కూడా అల్లరి నరేష్ గా మారిపోయింది. ఇప్పటికీ కూడా అందరూ నరేష్ ను అల్లరి నరేష్ అనే అంటారు. రవిబాబు ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. అన్ని సినిమాలు కూడా మంచి కాన్సెప్ట్ బేస్ గా ఉండేవి.

సురేష్ బాబుతో అనుబంధం 

రవి బాబుకి సురేష్ బాబు తో మంచి అనుబంధం ఉంది. సురేష్ బాబు కంటే కూడా అతని తండ్రి ప్రముఖ నిర్మాత డాక్టర్ రామానాయుడు గారితో విపరీతమైన బంధం రవిబాబుకి ఉంది. నా జీవితంలో నేను చూసిన అత్యంత గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దగ్గుపాటి రామానాయుడు గారు అని పలు సందర్భాల్లో రవిబాబు చెప్పారు.


ఒక సందర్భంలో షూటింగ్లో రామానాయుడు విపరీతంగా కష్టపడుతుంటే. సర్ ఎందుకు సర్ రోజుకి 16 , 17 గంటలు కష్టపడతారు ఈ ఏజ్ లో కూడా, మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పారట. చనిపోయిన తర్వాత అంతా రెస్ట్ ఏ కదా అని రామానాయుడు అన్నారట.

ఆ మాట ఆయన మామూలుగా చెప్పినా కూడా నన్ను బాగా ఆలోచించేలా చేసింది. అతని గ్రేట్ అతను లాంటి వ్యక్తి నా జీవితంలో పరిచయం అవడం నా అదృష్టం అని చెప్పారు.

చివరిసారిగా కాళ్లను తాకను

వయసులో మనకంటే పెద్దవారిని గౌరవించడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ కాళ్లకు మొక్కాలి అంటే అవతల వ్యక్తి వ్యక్తిత్వం చాలా గొప్పదై ఉండాలి. అందుకే చాలామంది కాళ్లు మొక్కడానికి ఆలోచిస్తూ ఉంటారు.

అయితే రామానాయుడు చనిపోయినప్పుడు చాలామంది వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన చితికి నిప్పు అంటించడానికి అంటే ముందు గంధపు చెక్కలను ఆ బాడీ మీద వేయాలి అని చెప్పారట. ఆ బాడీ మీద గంధపు చెక్కలు వేసే అవకాశం రవిబాబు కూడా దక్కింది. అయితే గంధపు చెక్కలతో అంతా కవర్ అయిపోయిన తరుణంలో, అతని కాళ్లు మాత్రమే బయటకు కనిపించాయట. వెంటనే ఒకసారి ఆ కాళ్ళను తాకి నమస్కరించాను అని చెప్పారు రవిబాబు.

Also Read : Mowgli: సందీప్ రాజ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం, అసలు కారణం ఏంటి?

Related News

SS Rajamouli : గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కి నో కెమెరాస్, తమిళ్ ఇండస్ట్రీని ఫాలో అవుతున్నారా?

50 Years Of Mohan Babu : మోహన్ బాబుకు గ్రాండ్ ఈవెంట్, ఈసారి ఏ వైరల్ స్పీచ్ ఇస్తారో?

SSMB29: పాట వింటుంటే టైటిల్ అదే అనిపిస్తుంది, వారణాశి నా లేక సంచారి నా?

Mowgli: సందీప్ రాజ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం, అసలు కారణం ఏంటి?

Shiva Remake: శివ రీమేక్ .. ఆ హీరోలకు అంత గట్స్ లేవన్న కింగ్..ఇలా అనేశాడేంటీ?

Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు

RGV: శివ కథను 20 నిమిషాల్లో రాశా, అక్కడి నుంచి కాపీ చేసా

Big Stories

×