BigTV English
Advertisement

Bahubali The Epic Collections : ‘బాహుబలి ది ఎపిక్’ కలెక్షన్ల కోత..రెండు రోజులకు ఎన్ని కొట్లంటే..?

Bahubali The Epic Collections : ‘బాహుబలి ది ఎపిక్’ కలెక్షన్ల కోత..రెండు రోజులకు ఎన్ని కొట్లంటే..?

Bahubali The Epic Collections : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమాల్లో ఆయన కెరియర్కు టర్నింగ్ పాయింట్ అయిన సినిమా అంటే టక్కున బాహుబలి పేరే వినిపిస్తుంది. ఈ మూవీ రెండు పార్టులు గా రిలీజ్ అయింది.. ఒకదానిని మించి మరొకటి రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన సినిమాకు జనాలనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మరోసారి రిలీజ్ అయ్యింది. బాహుబలి ది ఎపిక్ పేరుతో మూవీని రిలీజ్ చేశారు. మొదటి రోజు నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. పదేళ్లు పూర్తయిన కూడా ఈ మూవీ అదే టాక్ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. అంతేకాదు అటు కలెక్షన్లు కూడా భారీగానే వసూలు చేసింది.. మొదటి రోజు తో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. మరి ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..


బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్.. 

‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అయ్యింది. ఒక రోజు ముందే, అంటే అక్టోబర్ 30న ప్రీమియర్ షోలు పడ్డాయి.. రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క ,తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ఈ సినిమాలో తమ నటనతో ఆకట్టుకున్నారు. ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా.. కేకే సెంథిల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. అయితే ఈ సినిమాను మళ్ళీ థియేటర్లలో చూసేందుకు జనాలు ఆసక్తి కనబరిచారు. దాంతో అడ్వాన్స్ బుకింగ్ లు కూడా ఎక్కువగానే జరిగాయని తెలుస్తుంది. అడ్వాన్స్ సేల్స్ ద్వారానే రూ.9.25 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక.. అడ్వాన్స్ బుకింగ్స్‌.. రిలీజ్ అయిన ఫస్ట్ డే 4.5 కోట్లు వసూళ్లను సొంతం చేసుకుంది. అలాగే రెండో రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా 9.5 కోట్లను రాబట్టిందని తెలుస్తుంది. మరి ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో బాహుబలి టీం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

రీ రిలీజ్ మూవీస్.. ఫస్ట్ డే కలెక్షన్స్.. 

ఈమధ్య స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యి మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేశాయి. అంతేకాదు భారీగా వసూలను కూడా రాబట్టి మరో రికార్డ్ ని సొంతం చేసుకున్నాయి.. బాహుబలి రెండు సినిమాలను బాహుబలి ది ఏ పిక్ చిత్రంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గత నెల చివర్న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. మొదటిరోజు దాదాపు 10 కోట్ల వరకు రాబట్టిన సినిమా రెండో రోజు 9.5 కోట్లను వసూలు చేసింది.. ఈ వీకెండు ఈ సినిమాకు మంచి వసూలను అందించే అవకాశం ఉందని తెలుస్తుంది. పోతే ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాలకు ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత వచ్చాయో చూద్దాం.. బాహుబలి ది ఎపిక్ మూవీనే ఇప్పటివరకు వసూళ్లను అందుకుంది. గిల్ – రూ.10 కోట్లు, గబ్బర్ సింగ్ – రూ.8 కోట్లు, బిజినెస్ మ్యాన్ – రూ.5.27 కోట్లు, మురారి – రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాయి.. ఇదే జోరులో మరికొన్ని రోజులు సినిమా థియేటర్లలో ఉంటే మాత్రం కచ్చితంగా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు..


Related News

Sandeep Reddy: ఆ సినిమా వల్లే డైరెక్టర్ అయ్యాను.. మైండ్ నుంచి పోలేదంటున్న సందీప్ రెడ్డి!

Rashmika Mandanna: రష్మిక మంచి మనసు.. కృతజ్ఞత చూపించుకున్న నిర్మాతలు!

Vyjayanthi Movies: రైట్స్ అన్ని లోకల్ వాళ్లకే… అందరూ ఈ నిర్మాతల ఉండాలి

Mass jathara: మాస్ జాతర కలెక్షన్స్.. మరీ ఇంత దారుణం అయితే ఎలా బాసూ!

Prashanth Varma: ప్రశాంత్ వర్మ 100 కోట్లు ఇవ్వాలి… ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాత కంప్లైంట్

Dragon NTR Look Leak : డ్రాగన్ మూవీ నుంచి ఎన్టీఆర్ లుక్ లీక్.. ఏమున్నాడురా హీరో..

Star Heros : భార్యలకు విడాకులు ఇచ్చిన టాలీవుడ్ హీరోలు.. హీరోయిన్స్ తో ఎఫైర్స్..?

Big Stories

×