బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు అగౌరవంగా ప్రవర్తించడం కూడా నేరంగా పరిగణిస్తారు. తాజాగా మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్ లో ఒక యువకుడు చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. స్టేషన్ బోర్డు పోల్ మీద బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. సదరు యువకుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడి పేరు మీద ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌గా పేరు మార్చినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్టేషన్ లో కొత్తగా పెయింట్ చేసిన బోర్డు దగ్గర ఓ యువకుడు మూత్ర విసర్జన చేస్తుండగా, మరో ఇద్దరు వ్యక్తులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపిస్తుంది. మూత్రం పోసిన తర్వాత ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై రైల్వేసేవా స్పందించింది. “మీ ఫిర్యాదుపై తక్షణ చర్య తీసుకోవడానికి దయచేసి మీ మొబైల్ నంబర్ ను మాతో పంచుకోవాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము” అని వెల్లడించింది. అటు “RPF, పోలీసులు అతడిని పట్టుకుంటారు. కోర్టు జరిమానా విధిస్తుంది. బ్రిటిష్ పాలన నుంచి ఇది కామన్ అయ్యింది. ఈ ఘటనను సింపుల్ గా తీసుకోకూడదు. మున్సిపల్ చట్టాలు బహిరంగ మూత్ర విసర్జనను నిషేధిస్తాయి. కేవలం జరిమానా విధించి వదిలేస్తాయి. కానీ, ఈ ఘటనను మరింత సీరియస్ గా తీసుకోవాలి” అని నెటిజన్ కామెంట్ చేశాడు. “ఈ వ్యక్తిని తప్పకుండా అరెస్ట్ చేయాలి” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఇలాంటి వాడిని లాకప్ లో వేసి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. లేదంటే ఇలాంటి వారు మరింత మంది తయారవుతారు” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Bastards urinating at the newly named Chhatrapati Sambhaji Maharaj Station on the signboard 😡😡😡
RT if you want @CSNCityPolice to show them lots of love
cc @Dev_Fadnavis @DGPMaharashtra pic.twitter.com/caHLxY5bFn
— Sameer (@BesuraTaansane) October 31, 2025
Read Also: విమానాలకు ఎడమ వైపే ఎంట్రీ ఎందుకు ఉంటుంది? కుడి వైపు డోర్ ఎందుకు ఉండదు? కారణం ఇదేనట!
అటు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నాందేడ్ రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) క్రైమ్ నంబర్ 1487/2025, U/S 145(b) ఆఫ్ రైల్వేస్ చట్టం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై విచారణ కొనసాగుతుందన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: కోడలికి షాకిచ్చిన హైకోర్ట్.. ఆమె జీతంలో రూ.20 వేలు మావయ్యకు చెల్లించాలని తీర్పు, ఎందుకంటే?