E-Paper
Advertisement

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

Peddi Review: సినిమాల్లో హీరోలుగా నటించి మెప్పించడం వేరు.. నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకోవడం వేరు. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చి పాన్ ఇండియా రేంజ్‌లో ‘KGF’ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాకింగ్ స్టార్ యష్.. తాజాగా తన మానవత్వాన్ని చాటుకుని రియల్ హీరో అనిపించుకున్నారు. ప్రస్తుతం వరుస భారీ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, క్యాన్సర్‌తో మంచాన పడ్డ ఒక వీరాభిమాని కోసం ఆయన తీసుకున్న నిర్ణయం అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

Read also-థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

షూటింగ్ బిజీలోనూ మరవని బంధం..

శివమొగ్గ జిల్లా యష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సునీల్ గత కొంతకాలంగా రెక్టల్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న యష్ చలించిపోయారు. ప్రస్తుతం ఆయన షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నప్పటికీ.. టైమ్ జోన్ డిఫరెన్స్, బిజీ షెడ్యూల్స్‌ను పక్కన పెట్టి మరీ సునీల్‌కు నేరుగా వీడియో కాల్ చేసి మాట్లాడారు.

‘ధైర్యంగా ఉండు.. నేనున్నాను’

వీడియో కాల్‌ ద్వారా సునీల్‌ను పలకరించిన యష్.. అతని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. సునీల్ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి వారికి కొండంత మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. గతంలో సునీల్ ఫ్యాన్ క్లబ్‌లో యాక్టివ్‌గా ఉంటూ చేసిన పనులను ఈ సందర్భంగా యష్ గుర్తుచేసుకున్నారు.

“ఈ పోరాటంలో నువ్వు ఒంటరివి కావు. ధైర్యంగా ఉండు, నీకు నేనున్నాను” అంటూ యష్ పలికిన మాటలు ఆ అభిమాని కుటుంబంలో కొత్త ఆశలను నింపాయి. కాల్ ముగించే ముందు సునీల్‌కు చిరునవ్వుతో ఫ్లయింగ్ కిస్ ఇస్తూ యష్ వీడ్కోలు పలికిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో వైరల్..
యష్ తన అభిమానితో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, సినీ విశ్లేషకులు యష్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “అందుకే ఆయన రాకింగ్ స్టార్ అయ్యాడు.. స్టార్‌డమ్ తలకెక్కని నిజమైన హీరో” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read also-Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

భారీ చిత్రాలతో బిజీగా యష్..

ప్రస్తుతం యష్ చేతిలో రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’ (Toxic) షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది కాకుండా, నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ (Ramayana) చిత్రంలో యష్ లంకేశ్వరుడి (రావణుడు) పాత్రలో కనిపించనున్నారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

Related News

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

Big Stories

×